మాజీ ఉద్యోగి వేల మంది సిబ్బంది డేటాను దొంగిలించినట్లు ఆరోపించిన Credit Suisse
స్విట్జర్లాండ్‌లోని రెండవ అతిపెద్ద బ్యాంకు Credit Suisseలో ఒక మాజీ ఉద్యోగి జీతాలు, బోనస్‌లకు సంబంధించిన వేలాది మంది ఉద్యోగుల వ్యక్తిగత డేటాను దొంగిలించాడని సంస్థ ప్రకటించింది. డేటా చోరీ సమస్యను బ్యాంక్ మొదటిసారిగా మార్చి 2021లో గుర్తించింది. సంబంధిత డేటా రక్షణ అధికారులకు తెలియజేసింది. Credit Suisse ప్రస్తుతం కొంత ఆర్థిక సంక్షోభంలో ఉంది, పెద్ద ఎత్తున డేటా లీక్ అయ్యిందనే వార్తలతో అందరికి సమాధానం చెప్పలేక ఇరకాటంలో పడింది. ఏ సంస్థ డేటా అయినా చాలా ముఖ్యమైంది ఒకవేళ ఇలాంటివి ఏమైనా జరిగితే దుర్వినియోగం జరిగే అవకాశం ఉంది. లెగసీ ఇన్‌స్టిట్యూషన్‌లు లేదా స్టార్ట్-అప్‌లు అగ్రశ్రేణి సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్‌తో ఒప్పందాలు చేసుకుని డేటా రక్షణ చేయాలి.
డేటా చోరీ గురించి తెలుసుకున్న వెంటనే ఫోరెన్సిక్ విచారణను నిర్వహించింది Credit Suisse
మాజీ ఉద్యోగి బ్యాంక్ అనుమతి లేకుండా డేటాను వ్యక్తిగత డివైజ్ లోకి కాపీ చేసినట్లు ఆ సంస్థ ఉద్యోగులకు ఇమెయిల్ ద్వారా తెలియజేసింది. ఆ డేటాలో 2013-2015 మధ్య జీతం, వేరియబుల్ పే చెల్లించడానికి ఉపయోగించిన బ్యాంక్ ఖాతా వివరాలు ఉన్నాయి. అయితే, డేటా ఫార్వార్డ్ అయిందా అనేది సృష్టంగా తెలియలేదు. Credit Suisse డేటా చోరీ గురించి తెలుసుకున్న వెంటనే ఫోరెన్సిక్ విచారణను నిర్వహించింది. అయితే, కోవిడ్-19 మహమ్మారి కారణంగా జాప్యం జరిగింది. డేటాను దొంగిలించిన ఉద్యోగిపై శిక్షార్హమైన చర్యలను కొనసాగిస్తోంది. ఆర్కిగోస్, గ్రీన్‌సిల్ వంటి ఆర్థిక సంస్థల పతనం కారణంగా క్రెడిట్ సూయిస్ పరిస్థితి దిగజారింది. గత సంవత్సరం, సంస్థ 2008 తర్వాత $7.9 బిలియన్ల నష్టాన్ని నమోదు చేసింది.