LOADING...
Banking Sector: 2027 ఏప్రిల్‌ నుంచి ఈసీఎల్‌ నిబంధనలు అమలు; బ్యాంకింగ్‌ షేర్లపై ఒత్తిడి
2027 ఏప్రిల్‌ నుంచి ఈసీఎల్‌ నిబంధనలు అమలు; బ్యాంకింగ్‌ షేర్లపై ఒత్తిడి

Banking Sector: 2027 ఏప్రిల్‌ నుంచి ఈసీఎల్‌ నిబంధనలు అమలు; బ్యాంకింగ్‌ షేర్లపై ఒత్తిడి

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 29, 2026
08:43 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత బ్యాంకింగ్‌ రంగంలో కీలక మార్పుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీకారం చుట్టింది. అంచనా రుణ నష్టం నిబంధనలను 2027 ఏప్రిల్‌ 1 నుంచి తప్పనిసరిగా అమలు చేయనున్నట్లు ప్రకటించింది. గడువు పొడిగిస్తారనే ఆశలో ఉన్న మదుపరులకు ఈ నిర్ణయం నిరాశ కలిగించింది. దీంతో మంగళవారం స్టాక్‌ మార్కెట్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఏమిటీ ఈ ఈసీఎల్‌? ప్రస్తుతం బ్యాంకులు రుణాలు ఎగవేతకు గురైన తర్వాత మాత్రమే నష్టాలను గుర్తించి, అవసరమైన నిధులను పక్కన పెడుతున్నాయి. అయితే ఈసీఎల్‌ విధానంలో భవిష్యత్తులో సంభవించే నష్టాలను ముందుగానే అంచనా వేసి, వాటికి తగిన నిధులను కేటాయించాల్సి ఉంటుంది. ఇందుకోసం రుణాలను మూడు దశలుగా విభజిస్తారు.

వివరాలు 

మొదటి దశ

చెల్లింపులు సక్రమంగా జరుగుతున్న, ప్రమాదం తక్కువగా ఉన్న రుణాల కోసం రాబోయే 12 నెలల్లో సంభవించే నష్టాలను అంచనా వేసి నిధులు కేటాయించాలి. రెండో దశ రుణగ్రహీత చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటూ, ప్రమాదం గణనీయంగా పెరిగిన రుణాలకు మొత్తం జీవితకాల నష్టాలను అంచనా వేసి నిధులు కేటాయించాలి. ఈ దశలోనే బ్యాంకులపై ఎక్కువ భారం పడే అవకాశం ఉంది. మూడో దశ మొండి బాకీలుగా పరిగణించే రుణాలకు జీవితకాల నష్టాలను పూర్తిగా కేటాయించాలి. ప్రయోజనాలు ఈ విధానం ద్వారా బ్యాంకింగ్‌ రంగంలో పారదర్శకత, స్థిరత్వం పెరుగుతాయని ఆర్‌ బి ఐ తెలిపింది. ఖాతాలను మొండి బాకీలుగా గుర్తించే 90 రోజుల గడువు నిబంధనను యథాతథంగా కొనసాగించనుంది.

వివరాలు 

మూడీస్‌ విశ్లేషణ

రేటింగ్‌ సంస్థ మూడీస్ ప్రకారం ఈ మార్పు వల్ల ప్రభుత్వ బ్యాంకులపై తీవ్రమైన ఒత్తిడి ఉండదని తెలిపింది. నిబంధనలను నాలుగేళ్లపాటు దశలవారీగా అమలు చేయనున్నందున మూలధనంపై ప్రభావం పరిమితంగానే ఉంటుందని అంచనా వేసింది. అవసరమైతే డివిడెండ్లను కొద్దిగా తగ్గించడం వంటి చర్యలతో బ్యాంకులు సులభంగా సర్దుబాటు చేసుకోగలవని పేర్కొంది. ప్రభుత్వ బ్యాంకులపై ప్రభావం బ్రోకరేజీ సంస్థల అంచనాల ప్రకారం ఈ నిబంధనల వల్ల ప్రభుత్వ బ్యాంకుల నికర విలువపై 5 నుంచి 10 శాతం వరకు ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఖర్చులు కూడా కొంత మేర పెరగవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా హామీ లేని రుణాలు, సూక్ష్మ రుణాలు, వాహన రుణాలు ఎక్కువగా ఉన్న బ్యాంకులకు ప్రభావం అధికంగా ఉండవచ్చు.

Advertisement

వివరాలు 

కొత్త మార్గదర్శకాలు

గృహ రుణాలపై ఆధారపడిన బ్యాంకులకు ఈ విధానం అనుకూలంగా మారే అవకాశముంది. ఇకపై రుణగ్రహీతల నాణ్యత గణనీయంగా క్షీణిస్తే, దాన్ని ఒత్తిడి సంకేతంగా పరిగణించి బ్యాంకులు వెంటనే చర్యలు తీసుకోవాలి. గతంలో ఇది స్వచ్ఛంద చర్యగా ఉండగా, ఇప్పుడు తప్పనిసరి అవుతుంది. నిపుణుల అభిప్రాయం ఎస్‌బీఐ మాజీ ఛైర్మన్‌ దినేష్ ఖారా అభిప్రాయం ప్రకారం ఈ మార్పు బ్యాంకింగ్‌ వ్యవస్థను మరింత బలపరుస్తుంది. మొత్తం వ్యవస్థపై గణనీయమైన నిధుల కేటాయింపు భారం పడినా, బ్యాంకులు దాన్ని సమర్థంగా నిర్వహించగలవని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Advertisement

వివరాలు 

బ్యాంకింగ్‌ షేర్లకు అమ్మకాల ఒత్తిడి

ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు మార్కెట్లో బలహీనంగా మారాయి. యూనియన్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌, యూకో బ్యాంక్‌, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ షేర్లు క్షీణించాయి.

Advertisement