LOADING...
Vande Bharat Train: గోవా ట్రిప్ ఇక సూపర్ ఫాస్ట్.. వందే భారత్‌తో ప్రకృతి అందాల మధ్య ప్రయాణం!
గోవా ట్రిప్ ఇక సూపర్ ఫాస్ట్.. వందే భారత్‌తో

Vande Bharat Train: గోవా ట్రిప్ ఇక సూపర్ ఫాస్ట్.. వందే భారత్‌తో ప్రకృతి అందాల మధ్య ప్రయాణం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 28, 2026
09:24 am

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణ భారతదేశంలో రైల్వే కనెక్టివిటీని మరింత వేగవంతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. బెంగళూరు - మంగళూరు - మడ్గావ్ (గోవా) మధ్య కొత్త వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సేవలను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ రైలు పశ్చిమ కనుమలు ప్రకృతి సౌందర్యాల మధ్యుగా ప్రయాణిస్తూ పర్యాటకులకు ప్రత్యేక అనుభూతిని అందించనుంది.

వివరాలు

పశ్చిమ కనుమలు, కొంకణ్ తీరం గుండా ప్రయాణం

ఈ కొత్త రైలు కొంకణ్ తీరం వెంట ప్రయాణించనుంది. ఎత్తైన కొండలు, తీవ్రమైన మలుపులు (Steep Gradients) కారణంగా గతంలో ఈ మార్గంలో హై-స్పీడ్ రైళ్లు నడపడం సవాలుగా ఉండేది. అయితే ప్రస్తుతం సాంకేతిక అడ్డంకులు అధిగమించనట్లు మంత్రి తెలిపారు. ఈ సేవలు సౌత్ వెస్ట్రన్ రైల్వే (SWR) పరిధిలో నడవనున్నాయి. మూడు ప్రధాన నగరాల అనుసంధానం ఈ రైలు బెంగళూరు, మంగళూరు, మడ్గావ్ నగరాలను కలుపుతుంది. ప్రస్తుతం మంగళూరు - మడ్గావ్ మధ్య నడుస్తున్న వందే భారత్ (319 కి.మీ దూరాన్ని సుమారు 4.5 గంటల్లో పూర్తి చేస్తోంది) సేవలతో అనుసంధానం చేసే అవకాశముంది. దీంతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గే అవకాశముంది.

వివరాలు

పర్యాటక రంగానికి భారీ ఊతం

బెంగళూర్: ఐటీ హబ్, ప్రధాన ప్రయాణ కేంద్రం మంగళూర్: అందమైన బీచ్‌లు, చారిత్రక దేవాలయాలు మడ్గావ్: దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించే బీచ్‌లు, హెరిటేజ్ కేంద్రాలు ఈ మూడు ప్రాంతాలను వేగవంతమైన రైలుతో అనుసంధానించడం వల్ల పర్యాటక రంగం మరింత పుంజుకునే అవకాశం ఉంది. వందే భారత్ ప్రత్యేకతలు ఈ రైలు ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలు అందించనుంది: ఆటోమేటిక్ ప్లగ్ డోర్లు, రీక్లైనింగ్ సీట్లు KAVACH ప్రమాద నివారణ వ్యవస్థ CCTV నిఘా, ఆన్‌బోర్డ్ Wi-Fi వ్యాక్యూమ్ ఆధారిత బయో-టాయిలెట్లు గంటకు గరిష్టంగా 180 కి.మీ వేగం

Advertisement

వివరాలు

బెంగళూరు - ముంబై మధ్య కొత్త రైళ్లు

ఇంకా వచ్చే రెండు నెలల్లో బెంగళూర్, ముంబై మధ్య రెండు కొత్త రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. ఒకటి హుబ్బళ్లి-ధార్వాడ్ మార్గంగా వెళ్లే సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కాగా, మరొకటి రాత్రిపూట ప్రయాణికుల కోసం వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్. బుల్లెట్ రైలు అప్‌డేట్ దేశీయంగా అభివృద్ధి చేస్తున్న బుల్లెట్ రైలు నమూనా (Prototype) వచ్చే ఏడాదికి సిద్ధమవుతుందని, 2027 ద్వితీయార్థంలో ఉత్పత్తి ప్రారంభమవుతుందని మంత్రి తెలిపారు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, సౌకర్యవంతమైన ప్రయాణం కోరుకునే వారికి బెంగళూరు-మంగళూరు-గోవా వందే భారత్ రైలు అద్భుతమైన ఎంపికగా మారనుంది. ఇది కర్ణాటక మరియు గోవా రాష్ట్రాల మధ్య కనెక్టివిటీని కొత్త స్థాయికి తీసుకెళ్లనుంది.

Advertisement