LOADING...
Fastag: ఫేక్ ఫాస్టాగ్ సైట్ల దందా.. హైవే వాహనదారులకు అలర్ట్!
ఫేక్ ఫాస్టాగ్ సైట్ల దందా.. హైవే వాహనదారులకు అలర్ట్!

Fastag: ఫేక్ ఫాస్టాగ్ సైట్ల దందా.. హైవే వాహనదారులకు అలర్ట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 17, 2026
05:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) వాహనదారులకు కీలక హెచ్చరిక జారీ చేసింది. సెర్చ్ ఇంజన్లు, ఆన్‌లైన్ ప్రకటనల ద్వారా మోసగాళ్లు అధికారిక వెబ్‌సైట్లను పోలిన నకిలీ పోర్టల్స్ సృష్టించి ప్రజలను మోసం చేస్తున్నారని అధికారులు వెల్లడించారు.

Details

మోసం ఎలా జరుగుతోంది?

సైబర్ నేరగాళ్లు అత్యంత చాకచక్యంగా ఈ స్కామ్‌ను అమలు చేస్తున్నారు. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారిక వెబ్‌సైట్లను అచ్చుగుద్దినట్లు పోలి ఉండే నకిలీ సైట్లను రూపొందిస్తున్నారు. గూగుల్ వంటి సెర్చ్ ఇంజన్లలో పెయిడ్ అడ్వర్టైజ్‌మెంట్లు, ఎస్‌ఈఓ పద్ధతులను వినియోగించి యూజర్లు "ఫాస్టాగ్ రీచార్జ్" వంటి పదాలతో వెతికినప్పుడు తమ నకిలీ లింకులు ముందుగా కనిపించేలా చేస్తున్నారు. యూజర్లు ఆ లింక్‌పై క్లిక్ చేసిన వెంటనే మొబైల్ నంబర్, వాహన రిజిస్ట్రేషన్ వివరాలు, చెల్లింపు సమాచారం అడుగుతారు. పేమెంట్ గేట్‌వే కూడా అసలైనదానిలా కనిపిస్తుంది. కానీ యూజర్లు చెల్లించిన మొత్తం నేరుగా మోసగాళ్ల ఖాతాల్లోకి వెళ్లిపోతుంది. డబ్బు కట్ అయిన తర్వాత ఎలాంటి కన్ఫర్మేషన్ రాదు.

Details

యూజర్లు పాటించాల్సిన జాగ్రత్తలు

అంతేకాకుండా, ఆ నకిలీ వెబ్‌సైట్లు కొద్దిసేపట్లోనే కనిపించకుండా పోతాయి. ఫాస్టాగ్ సేవలను కేవలం అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్లు, ధృవీకరించిన బ్యాంకులు లేదా విశ్వసనీయ పేమెంట్ యాప్‌ల ద్వారానే వినియోగించాలి. ఏ వెబ్‌సైట్ ఓపెన్ చేసినా ముందుగా యూఆర్‌ఎల్ అడ్రస్‌ను జాగ్రత్తగా పరిశీలించాలి. స్పాన్సర్డ్ లింకులు లేదా గుర్తు తెలియని ప్రకటనలపై క్లిక్ చేయకుండా ఉండాలి. టెక్నికల్ సపోర్ట్ పేరుతో ఫోన్ చేసినా, వెబ్‌సైట్లలో అడిగినా ఓటీపీలు, కార్డు వివరాలు,పిన్ నంబర్లు ఎవరికీ వెల్లడించకూడదు. ఏదైనా వెబ్‌సైట్ అనుమానాస్పద పర్మిషన్లు అడిగితే లేదా అసాధారణంగా అనిపిస్తే వెంటనే ఆ సైట్ నుంచి బయటకు రావాలి. నిజమైన ఫాస్టాగ్ సేవలు కేవలం అధీకృత బ్యాంకులు మరియు అధికారిక ఎన్‌హెచ్‌ఏఐ ఛానెళ్ల ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయి.

Advertisement