RBI: 2022-23లో బ్యాంకులకు రూ.40.4కోట్ల పెనాల్టీ విధించిన ఆర్బీఐ
2022-23 ఆర్థిక సంవత్సరంలో అన్ని రకాల బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) రూ. 40.39కోట్ల పెనాల్టీని విధించినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ తెలిపారు. ఈ ఏడాది ఆర్ బి ఐ మొత్తం 176జరిమానాలు విధించినట్లు కరాద్ వెల్లడించారు. ఏడాది పొడవునా సహకార బ్యాంకులపై రూ.14.04కోట్లు,ప్రైవేట్ రంగ బ్యాంకులకు రూ. 12.17కోట్లు, ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 3.65కోట్లు, విదేశీ బ్యాంకులకు రూ.4.65 కోట్ల పెనాల్టీ విధించినట్లు కరాద్ పేర్కొన్నారు. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు రూ. 0.97 కోట్లు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు రూ. 0.42 కోట్లు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు రూ. 0.10 కోట్లు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు రూ. 4.39 కోట్ల జరిమానాను ఆర్బీఐ విధించింది.