LOADING...
Small business enterprises: చిన్న వ్యాపారాలకు రుణాల వెల్లువ.. రూ.46 లక్షల కోట్లకు చేరిన మంజూర్లు
చిన్న వ్యాపారాలకు రుణాల వెల్లువ.. రూ.46 లక్షల కోట్లకు చేరిన మంజూర్లు

Small business enterprises: చిన్న వ్యాపారాలకు రుణాల వెల్లువ.. రూ.46 లక్షల కోట్లకు చేరిన మంజూర్లు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 27, 2025
11:58 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలోని చిన్న వ్యాపార సంస్థలకు అందుతున్న రుణాలు కొత్త రికార్డును సృష్టించాయి. ఈ ఏడాది సెప్టెంబరు 30 నాటికి మంజూరైన మొత్తం రుణాల విలువ రూ.46 లక్షల కోట్లకు చేరినట్లు క్రిఫ్‌ హై మార్క్‌-సిడ్బీ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఇదే సమయంలో క్రియాశీలక రుణ ఖాతాల సంఖ్య 7.3 కోట్లుగా నమోదైనట్లు తెలిపింది. ప్రభుత్వం అమలు చేస్తున్న విధాన నిర్ణయాలు, ఎంఎస్‌ఎమ్‌ఈ (సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు) కోసం ప్రవేశపెట్టిన వివిధ రుణ పథకాలు ఈ వృద్ధికి ప్రధాన కారణమని నివేదిక పేర్కొంది. అంతేకాకుండా వివిధ విభాగాల్లో రుణ ఆస్తుల నాణ్యత కూడా మెరుగుపడినట్లు వెల్లడించింది.

Details

తొలిసారి రుణాల పొందిన వారి వాటా 12శాతం

91 నుంచి 180 రోజుల వరకు ఓవర్‌డ్యూ ఉన్న రుణ బకాయిల నిష్పత్తి 2023 సెప్టెంబరులో 1.7 శాతంగా ఉండగా, 2025 సెప్టెంబరు నాటికి ఇది 1.4 శాతానికి తగ్గినట్లు నివేదిక వివరించింది. 2025 సెప్టెంబరు చివరి నాటికి నమోదైన మొత్తం రుణగ్రహీతల్లో 23.3 శాతం మంది కొత్తగా రుణాలు తీసుకున్నవారని, వ్యాపారం కోసం తొలిసారి రుణాలు పొందిన వారి వాటా 12 శాతంగా ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది. వ్యాపార సంస్థలు తీసుకునే రుణాల్లో నిర్వహణ మూలధన అవసరాల కోసం తీసుకున్నవే అధికమని, మొత్తం రుణాల్లో వీటి వాటా 57 శాతంగా ఉన్నట్లు క్రిఫ్‌ హై మార్క్‌-సిడ్బీ నివేదిక వెల్లడించింది.

Advertisement