Forbes 30 Under 30 Asia:ఫోర్బ్స్ 30 అండర్ 30 జాబితా 9వ ఎడిషన్ విడుదల.. భారతీయ యువ పారిశ్రామికవేత్తలు వీరే..
ప్రతిష్టాత్మక మ్యాగజైన్ ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో పరిశ్రమకు కొత్త దిశానిర్దేశం చేయగల,దానిని మార్చగల సామర్థ్యం ఉన్న వివిధ రంగాలకు చెందిన 30 ఏళ్లలోపు అగ్రశ్రేణి వ్యవస్థాపక నాయకులు,ఆవిష్కర్తల పేర్లు ఉన్నాయి. ఈ జాబితాలో భారతీయ స్టార్టప్ స్టాటిక్ సహ వ్యవస్థాపకులు అక్షిత్ బన్సాల్, రాఘవ్ అరోరా, ది డిస్పోజల్ కంపెనీ వ్యవస్థాపకురాలు భాగ్యశ్రీ జైన్ కూడా ఉన్నారు.
అక్షిత్ బన్సాల్, రాఘవ్ అరోరా
ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా జాబితాలో అక్షిత్ బన్సాల్, రాఘవ్ అరోరా పేర్లు ఉన్నాయి. వారు ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ నెట్‌వర్క్‌పై పనిచేస్తున్న స్టాటిక్ అనే కంపెనీకి సహ వ్యవస్థాపకులు. వారి కంపెనీ స్టాటిక్, ఎలక్ట్రిక్ కార్లు, బస్సులు, ట్రక్కులు, మూడు చక్రాల వాహనాల కోసం దేశవ్యాప్తంగా ఛార్జింగ్ స్టేషన్ల నెట్‌వర్క్‌ను అందిస్తుంది. ఈ కంపెనీ 2024 సంవత్సరంలో $27.5 మిలియన్ల నిధులను పొందింది. 2025 నాటికి దేశవ్యాప్తంగా 16,000 ఛార్జింగ్ నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
భాగ్యశ్రీ జైన్
ఈ జాబితాలో 29 ఏళ్ల భాగ్యశ్రీ జైన్ పేరు కూడా ఉంది. ఆమె డిస్పోజల్ కంపెనీ వ్యవస్థాపకురాలు. 2020 నుండి ప్లాస్టిక్ న్యూట్రాలిటీపై దృష్టి సారిస్తోంది. మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం భాగ్యశ్రీ తల్లికి క్యాన్సర్ సోకింది. ఆమెకు కూడా భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ఆమెకు చికిత్స చేస్తున్న డాక్టర్ చెప్పారు. దీంతో ఆమె భయపడిపోయింది. దీని తరువాత ఆమె దానిపై పరిశోధన ప్రారంభించింది. క్యాన్సర్ ప్రధాన మూలం మైక్రోప్లాస్టిక్ అని కనుగొంది. దీని తర్వాత ప్లాస్టిక్‌ని రీసైక్లింగ్ చేయడం ద్వారా దేశాన్ని బాగు చేయాలని నిర్ణయించుకుంది. వినియోగ వస్తువులను తయారు చేసే కంపెనీలు ప్లాస్టిక్ ను తగ్గించడంపై దృష్టి పెట్టాలని ఆమె అభిప్రాయపడింది.
విభిన్న రంగాలకు చెందిన పలువురు భారతీయ పారిశ్రామికవేత్తలు
30 అండర్ 30 ఆసియా 2024 జాబితాలో వివిధ వర్గాలలో 900 మంది పేర్లు ఉన్నాయి. వివిధ విభాగాల్లో మొదటి ర్యాంక్ సాధించిన వారి గురించి ఇప్పుడు చూద్దాం.. Industry, Manufacturing & Energy: అక్షిత్ బన్సల్ (29), రాఘవ్ అరోరా (28), సహ వ్యవస్థాపకులు స్టాటిక్ - భారతదేశం Social Impact: భాగ్యశ్రీ జైన్ (29), ది డిస్పోజల్ కంపెనీ వ్యవస్థాపకురాలు - భారతదేశం Finance & Venture Capital: అలీనా నదీమ్ (29), ఫౌండర్ EduFi - పాకిస్తాన్ Arts: క్లైన్ డాసన్ (29), సహ వ్యవస్థాపకుడు జిమ్ బాడ్ - ఆస్ట్రేలియా Entertainment & Sports: వాయిస్ ఆఫ్ బ్యాక్‌రూట్, మెటల్ బ్యాండ్ - ఇండోనేషియా
విభిన్న రంగాలకు చెందిన పలువురు భారతీయ పారిశ్రామికవేత్తలు
Media, Marketing & Advertising: ఎరికా ఎంగ్ (25) కామిక్ ఆర్టిస్ట్ - మలేషియా Retail & Ecommerce: యోమి హ్వాంగ్ (29) సహ వ్యవస్థాపకుడు యోలో - దక్షిణ కొరియా Enterprise Technology: వీయాంగ్ (27) వ్యవస్థాపకుడు స్మాల్ ఈల్ - చైనా Healthcare & Science: జాంగ్ జికున్ (28), ఫౌండర్ టిడెట్రాన్ బయోవర్క్స్ - చైనా Consumer Technology: జాన్సన్ లిమ్ (29) సహ వ్యవస్థాపకుడు GetGo - సింగపూర్