India's GDP: గుడ్‌న్యూస్.. Q3 2024-25లో 6.2 శాతం పెరిగిన భారత జీడీపీ..
ఈ వార్తాకథనం ఏంటి
భారత స్థూల జాతీయోత్పత్తి (GDP) 2024 డిసెంబర్ ముగిసే నాటికి మూడో త్రైమాసికంలో (Q3 FY25) 6.2 శాతం వృద్ధి చెందింది.
ఈ విషయాన్ని శుక్రవారం విడుదలైన అధికారిక ప్రకటనలో వెల్లడించారు.
గత రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 5.4 శాతంగా ఉండగా, ఈసారి 6.3 శాతం పెరుగుతుందని నిపుణులు అంచనా వేశారు.
అయితే, మరికొందరు ఇది 5.8 శాతం నుంచి 6.5 శాతం మధ్య ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.
వివరాలు
జీడీపీ రూ.47.17 లక్షల కోట్లు
స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) ఈ గణాంకాలను వెల్లడించింది.
2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మూడో త్రైమాసికంలో స్థిరమైన ధరల ఆధారంగా జీడీపీ రూ.47.17 లక్షల కోట్లుగా ఉన్నట్లు పేర్కొంది.
అయితే, 2023-24 ఆర్థిక సంవత్సరంలోని మూడో త్రైమాసికంలో జీడీపీ రూ.44.44 లక్షల కోట్లుగా నమోదైనట్లు తెలిపింది.
మొత్తంగా, ఈసారి 6.2 శాతం వృద్ధి నమోదైనట్లు స్పష్టమైంది.