Page Loader
అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కోసం భారత్‌కు ఫ్రాన్స్, జర్మనీ 100మిలియన్ యూరోల రుణం 
అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కోసం భారత్‌కు ఫ్రాన్స్, జర్మనీ 100మిలియన్ యూరోల రుణం

అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కోసం భారత్‌కు ఫ్రాన్స్, జర్మనీ 100మిలియన్ యూరోల రుణం 

వ్రాసిన వారు Stalin
Jan 02, 2024
02:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పునరుజ్జీవనం, పట్టణ అభివృద్ధికి చేపట్టిన అటల్ మిషన్ (అమృత్) 2.0కి మద్దతుగా మిలియన్ (దాదాపు రూ. 920 కోట్లు) రుణాన్ని అందించాలని ఫ్రాన్స్, జర్మనీ యోచిస్తున్నాయి. దీనిపై ఫిబ్రవరిలో సంతకాలు చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో త్వరలోనే చర్చలు ప్రారంభం కానున్నాయి. సిటీ ఇన్వెస్ట్‌మెంట్స్ టు ఇన్నోవేట్, ఇంటిగ్రేట్ అండ్ సస్టైన్ (CITIIS) 2.0 ప్రోగ్రామ్‌లో మూడు దేశాలు దేశాలు పాల్గొన్న సమయంలో ఈ అంశం చర్చకు వచ్చింది. ఈ క్రమంలో ఫ్రాన్స్, జర్మనీ దేశాలు 100 మిలియన్ యూరోల చొప్పున రుణం అందిచాలని నిర్ణయించాయి.

భారత్

2021లో ప్రారంభమైన 'అమృత్ 2.0' కార్యక్రమం 

'అమృత్ 2.0' అనేది.. అక్టోబర్ 2021లో ఐదేళ్ల (FY22-FY26 వరకు) లక్ష్యంతో ప్రారంభించారు. 500 నగరాల్లో మురుగునీరు, సెప్టేజీ నిర్వహణ వ్యవస్థలను మెరుగుపర్చేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు. ఫ్రాన్స్, జర్మనీ రెండూ భారతదేశంలో అనేక పట్టణ పరివర్తన ప్రాజెక్టులకు నిధులు సమకూర్చాయి. ఫ్రాన్స్ ఏఎఫ్‌డీ బ్యాంక్ CITIIS 1.0 కార్యక్రమంలో భాగస్వామిగా చేరింది. నాగ్‌పూర్, పాండిచ్చేరి, చండీగఢ్‌లలో స్మార్ట్ సిటీస్ మిషన్ కోసం ఆ దేశం తమ నైపుణ్యాన్ని అందించింది. బెంగళూరు, పూణే, సూరత్, కొచ్చి వంటి నగరాల్లో మెట్రో ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేసింది. జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ బ్యాంకు కూడా దేశవ్యాప్తంగా మెట్రో ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టింది. ఇది బెంగళూరు సబర్బన్ రైలు వ్యవస్థ విస్తరణకు రుణాన్ని అందించింది.