Global arms: రికార్డు స్థాయికి ప్రపంచ ఆయుధాల అమ్మకాలు.. ఏడాదిలో రూ.679 బిలియన్ డాలర్లు!
ఈ వార్తాకథనం ఏంటి
గతేడాది ప్రపంచవ్యాప్తంగా ఆయుధాల అమ్మకాలు రికార్డు స్థాయిలో రూ. 679 బిలియన్ డాలర్లకు చేరాయి. స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) విడుదల చేసిన నివేదిక ప్రకారం, ప్రపంచంలోని టాప్-100 రక్షణ కంపెనీలు ఇంత భారీగా అమ్మకాలు సాధించడం ఇదే తొలి సారి. ఉక్రెయిన్, గాజా యుద్ధాల కారణంగా ప్రభుత్వాలు వేగంగా ఆయుధాలు కొనుగోలు చేయడం, ఖాళీ అవుతున్న నిల్వలను నింపుకోవడమే ఇందుకు ప్రధాన కారణమైంది. గత ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు 6 శాతం వృద్ధి కాగా, 2015తో పోలిస్తే ఏకంగా 26 శాతం పెరుగుదల జరిగింది. యూరోప్ దేశాల నుంచే ఎక్కువ డిమాండ్ వచ్చిందని SIPRI పరిశోధకుడు జేడ్ గిబర్టో రికార్డ్ చెప్పారు.
వివరాలు
ఆయుధాల తయారీలో అమెరికానే అగ్రస్థానం
ఉక్రెయిన్ యుద్ధం,రష్యాను ముప్పుగా భావించడమే ఇందుకు కారణమని తెలిపారు. కీవ్‌కు నేరుగా ఆయుధాలు అందించని దేశాలు కూడా తమ సైన్యాలను ఆధునీకరించడంలో పడ్డాయని చెప్పారు. ఆయుధాల తయారీలో అమెరికానే అగ్రస్థానంలో కొనసాగుతోంది. టాప్-100 జాబితాలో అమెరికాకు చెందిన 39 కంపెనీలు ఉండగా, లాక్‌హీడ్ మార్టిన్, RTX, నార్త్రాప్ గ్రుమ్‌మన్ వంటి సంస్థలు కలిసి 334 బిలియన్ డాలర్ల అమ్మకాలు చేశాయి. అంటే ప్రపంచ మొత్తం అమ్మకాలలో దాదాపు సగం. F-35 ఫైటర్ జెట్, కొలంబియా క్లాస్ సబ్‌మరైన్ ప్రాజెక్టుల్లో ఆలస్యాలు, ఖర్చులు పెరిగినా ఆదాయాలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. మరోవైపు యూరోప్‌కు చెందిన 26 కంపెనీల అమ్మకాలు 13 శాతం పెరిగి 151 బిలియన్ డాలర్లకు చేరాయి.
వివరాలు
రష్యా డిఫెన్స్ పరిశ్రమ అమ్మకాలలో 23 శాతం వృద్ధి
చెక్ దేశానికి చెందిన చెకోస్లోవక్ గ్రూప్ ఉక్రెయిన్‌కు ఆర్టిలరీ గుగ్గిళ్లు సరఫరా చేయడంతో దాని అమ్మకాలు దాదాపు 200 శాతం పెరిగాయి. అయితే కీలక ఖనిజాలపై చైనా ఎగుమతి ఆంక్షలు, రష్యా దాడి తరువాత కొత్త సరఫరాదారుల అన్వేషణ వంటి కారణాలతో ముడి సరుకుల సరఫరా కష్టమైందని తెలిపారు. ఆంక్షలు, కీలక యంత్ర భాగాల కొరత ఉన్నా రష్యా డిఫెన్స్ పరిశ్రమ అమ్మకాలలో 23 శాతం వృద్ధి సాధించింది. రోస్టెక్, యునైటెడ్ షిప్‌బిల్డింగ్ కార్పొరేషన్ వంటి సంస్థలకు దేశీయ డిమాండ్ బలంగా నిలవడంతో ఎగుమతులు తగ్గినప్పటికీ ఆదాయం పెరిగిందని SIPRI పేర్కొంది.
వివరాలు
ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో మాత్రం ఆయుధాల అమ్మకాలు స్వల్పం
అయితే అవసరమైనంత నిపుణ కార్మికులు దొరకకపోవడం ఉత్పత్తి లక్ష్యాలకు అడ్డంకిగా మారుతుందని హెచ్చరించింది. ఇక ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో మాత్రం ఆయుధాల అమ్మకాలు స్వల్పంగా 1.2 శాతం తగ్గి 130 బిలియన్ డాలర్లకు దిగిపోయాయి. చైనాలో కొనుగోళ్లలో అవినీతి ఆరోపణలతో పెద్ద ఒప్పందాలు ఆలస్యం కావడం లేదా రద్దవడం ఇందుకు కారణమైంది. అయితే జపాన్, దక్షిణ కొరియా కంపెనీలు యూరోప్ నుంచి వచ్చిన డిమాండ్‌తో మంచి వృద్ధిని సాధించినట్లు నివేదిక వెల్లడించింది.