Loading...
Gold and Silver ETF: గోల్డ్‌,సిల్వర్‌ ఈటీఎఫ్‌లలో భారీ పతనం.. సిప్‌ కొనసాగించాలా? ఆపేయాలా?
గోల్డ్‌,సిల్వర్‌ ఈటీఎఫ్‌లలో భారీ పతనం.. సిప్‌ కొనసాగించాలా? ఆపేయాలా?

Gold and Silver ETF: గోల్డ్‌,సిల్వర్‌ ఈటీఎఫ్‌లలో భారీ పతనం.. సిప్‌ కొనసాగించాలా? ఆపేయాలా?

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 20, 2026
01:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం,వెండి ధరలు తగ్గుముఖం పట్టడంతో వాటికి అనుసంధానమైన గోల్డ్‌, సిల్వర్‌ ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ETFలు) కూడా భారీగా నష్టపోతున్నాయి. శుక్రవారం ఈ రెండు విలువైన లోహాల ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో ఈటీఎఫ్‌ల విలువ కూడా 9 శాతం వరకు క్షీణించింది. అమెరికన్‌ డాలర్‌ బలపడటం, ఫెడరల్‌ రిజర్వ్‌ (ఫెడ్‌) వడ్డీ రేట్లను పెంచవచ్చనే అంచనాలు బంగారం, వెండి ధరలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా ఈ లోహాలపై ఆధారపడిన ఈటీఎఫ్‌లు కూడా నష్టాలను చవిచూస్తున్నాయి.

వివరాలు 

ఎన్‌ఎస్‌ఈలో 9 శాతం క్షిణించిన ఎస్‌బీఐ సిల్వర్‌ ఈటీఎఫ్

యాక్సిస్‌ గోల్డ్‌ ఈటీఎఫ్‌, ఇన్వెస్కో ఇండియా గోల్డ్‌ ఈటీఎఫ్‌, మోతీలాల్‌ ఓస్వాల్‌ గోల్డ్‌ ఈటీఎఫ్‌, ఛాయిస్‌ గోల్డ్‌ ఈటీఎఫ్‌ల విలువ దాదాపు 6 శాతం మేర పడిపోయింది.

ఇతర గోల్డ్‌ ఈటీఎఫ్‌లు కూడా 5 శాతం వరకు నష్టపోయాయి. మరోవైపు సిల్వర్‌ ఈటీఎఫ్‌లపైనా పతన ప్రభావం కనిపించింది.

ఎస్‌బీఐ సిల్వర్‌ ఈటీఎఫ్‌ శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో ఒక దశలో దాదాపు 9 శాతం క్షీణించింది.

హెచ్‌డీఎఫ్‌సీ సిల్వర్‌ ఈటీఎఫ్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ సిల్వర్‌ ఈటీఎఫ్‌, నిప్పాన్‌ ఇండియా సిల్వర్‌ ఈటీఎఫ్‌లు సైతం 7 శాతం మేర నష్టపోయాయి.

వివరాలు 

పెట్టుబడులను కొనసాగించాలా? నిలిపివేయాలా?

ఈ ఏడాది జనవరితో పోలిస్తే బంగారం, వెండి ధరలు ఇప్పటికే గణనీయమైన దిద్దుబాటుకు గురయ్యాయి.

తాజాగా ఈటీఎఫ్‌ల విలువలు కూడా పడిపోవడంతో వీటిలో పెట్టుబడులు పెట్టినవారిలో ఆందోళన నెలకొంది.

ప్రస్తుతం కొనసాగిస్తున్న పెట్టుబడులను అలాగే ఉంచాలా? లేక సిప్‌లను నిలిపివేయాలా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే దీర్ఘకాలిక పెట్టుబడి లక్ష్యాలు ఉన్నవారు సిప్‌ విధానంలో పెట్టుబడులను కొనసాగించడం మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

మార్కెట్‌ ధరలు తగ్గినప్పుడు అదే మొత్తంతో గతంలో కంటే ఎక్కువ యూనిట్లను కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు.

దీనివల్ల దీర్ఘకాలంలో సగటు కొనుగోలు ధరను తగ్గించుకోవచ్చని చెబుతున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

పెట్టుబడులను కొనసాగించాలా? నిలిపివేయాలా?

అయితే ధరలు భారీగా తగ్గాయనే కారణంతో ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం లేదా భయంతో ఉన్న యూనిట్లన్నింటినీ విక్రయించడం సరికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా వెండి పెట్టుబడుల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.

ధరలు తగ్గాయనే ఉద్దేశంతో వెండిలో పెట్టుబడుల మొత్తాన్ని వెంటనే పెంచకూడదని చెబుతున్నారు.

బంగారంతో పోలిస్తే వెండి ధరల్లో ఒడుదొడుకులు ఎక్కువగా ఉంటాయని గుర్తుచేస్తున్నారు.

అమెరికన్‌ డాలర్‌ విలువ తగ్గడం,బాండ్‌ రాబడులు క్షీణించడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటే బంగారం,వెండి ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

డిసెంబర్‌ 8,9తేదీల్లో జరగనున్నఅమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశం తర్వాత వడ్డీరేట్లపై తీసుకునే నిర్ణయంతో ఈ లోహాలధరల భవిష్యత్తుపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

పోర్ట్‌ఫోలియోలో ఎంత కేటాయించాలి?

మొత్తం పెట్టుబడుల్లో రిస్క్‌ను తగ్గించి వైవిధ్యం తీసుకురావడానికి బంగారానికి 10 నుంచి 15 శాతం వరకు కేటాయించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

బంగారం, వెండి రెండింటిలోనూ పెట్టుబడులు పెట్టాలనుకునేవారు 70:30 నిష్పత్తిని పాటించడం సముచితమని చెబుతున్నారు.

అంటే ఈ రెండు లోహాల్లో పెట్టుబడి పెట్టే మొత్తంలో 70 శాతం బంగారానికి, మిగిలిన 30 శాతం వెండికి కేటాయించాలని సూచిస్తున్నారు.

ADVERTISEMENT