LOADING...
Gold Price Today: మళ్లీ పుంజుకున్న బంగారం .. నేడు తులం ధర ఎంత ఉందంటే ?
మళ్లీ పుంజుకున్న బంగారం .. నేడు తులం ధర ఎంత ఉందంటే ?

Gold Price Today: మళ్లీ పుంజుకున్న బంగారం .. నేడు తులం ధర ఎంత ఉందంటే ?

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 18, 2025
11:20 am

ఈ వార్తాకథనం ఏంటి

గత రెండు రోజులుగా స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు ఇప్పుడు మళ్లీ జోరు అందుకుంది. ఆల్‌టైం రికార్డ్ స్థాయికి చేరుకుని అక్కడే నిలకడగా కొనసాగుతున్నాయి. నిన్న ఒక్క రోజులోనే తులం బంగారంపై భారీగా రూ.650 పెరుగుదల నమోదవ్వగా, ఇవాళ కూడా అదే ట్రెండ్ కనిపించింది. బుధవారం నుంచి గురువారం మధ్యలోనూ బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల చోటుచేసుకుంది. ఫలితంగా డిసెంబర్ 18 గురువారం ఉదయం ఆరు గంటల సమయానికి మార్కెట్‌లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,34,520గా కొనసాగుతోంది. బుధవారం ఉదయం రూ.650 పెరిగి రూ.1,34,510గా ఉన్న ధర, ఇవాళ ఉదయానికి మరో రూ.10 పెరిగి ప్రస్తుతం రూ.1,34,520కు చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం తులం ధర రూ.1,23,310గా ఉంది.

వివరాలు 

బంగారం బాటలోనే వెండి  

బంగారం బాటలోనే వెండి ధరలు కూడా కదులుతున్నాయి. నిన్న ఒక్క రోజులోనే కేజీ వెండిపై ఏకంగా రూ.11,000 పెరిగింది. బుధవారం నుంచి గురువారం మధ్యలో స్వల్పంగా మరింత పెరిగి వెండి ధరలు హాల్‌టైం హై స్థాయిని తాకాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.2,08,100గా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

వివరాలు 

 ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు 

ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,670గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,23,460గా కొనసాగుతోంది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,520 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,23,310గా ఉంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,34,520గా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,23,310గా కొనసాగుతోంది. విజయవాడలో కూడా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,520గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,23,310గా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,290గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,24,010గా కొనసాగుతోంది.

Advertisement

వివరాలు 

డాలర్ విలువలో మార్పులు

బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,34,520గా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,23,310గా ఉంది. బంగారం ధరలు ఈ స్థాయిలో పెరగడానికి ప్రధాన కారణం డాలర్ విలువ తగ్గడమేనని నిపుణులు చెబుతున్నారు. డాలర్ విలువలో మార్పులు బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలపై నేరుగా ప్రభావం చూపుతాయంటున్నారు. అందుకే ఈ మధ్య కాలంలో ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. కాబట్టి బంగారం కొనుగోలు చేసే ముందు తాజా ధరలను తప్పకుండా పరిశీలించాలని సూచిస్తున్నారు.

Advertisement