Gold and Silver Prices: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీ పతనమైన బంగారం,వెండి ధరలు
ఈ వార్తాకథనం ఏంటి
బంగారం,వెండి కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి ఇది ఊరటనిచ్చే వార్త. బుధవారం దేశీయ మార్కెట్లో పసిడి, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ తగ్గుదల కొంత ఉపశమనం కలిగించే అంశంగా మారింది. తాజాగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.4,300 తగ్గగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,950 మేర పడిపోయింది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.3,230 తగ్గింది. గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్‌లో ఉదయం 10 గంటల సమయానికి నమోదైన వివరాల ప్రకారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,48,860గా ఉంది.
వివరాలు
వెండి ధరల్లోనూ భారీ తగ్గుదల
22 క్యారెట్ల బంగారం ధర రూ.1,36,450కు చేరగా, 18 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,11,640 వద్ద ట్రేడవుతోంది. బంగారం బాటలోనే వెండి ధరలు కూడా గణనీయంగా తగ్గాయి. 100 గ్రాముల వెండిపై రూ.1,000 తగ్గగా, కిలో వెండి ధర ఏకంగా రూ.10 వేల మేర పడిపోయింది. గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ వివరాల ప్రకారం హైదరాబాద్ మార్కెట్లో ఉదయం 10 గంటల సమయానికి 100 గ్రాముల వెండి ధర రూ.26,000గా ఉండగా, కిలో వెండి ధర రూ.2,60,000 వద్ద ట్రేడవుతోంది. బంగారం, వెండి ధరల్లో ఈ భారీ తగ్గుదలతో ఆభరణాల కొనుగోలు చేయాలనుకునే వారు, పెట్టుబడిదారులు తాజా రేట్లపై ఆసక్తి చూపుతున్నారు.