LOADING...
Gold and Silver Prices: గోల్డ్, సిల్వర్ రేట్లలో స్వల్ప మార్పు.. హైదరాబాద్ మార్కెట్ తాజా ధరలు ఇవే..
గోల్డ్, సిల్వర్ రేట్లలో స్వల్ప మార్పు.. హైదరాబాద్ మార్కెట్ తాజా ధరలు ఇవే..

Gold and Silver Prices: గోల్డ్, సిల్వర్ రేట్లలో స్వల్ప మార్పు.. హైదరాబాద్ మార్కెట్ తాజా ధరలు ఇవే..

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 05, 2026
10:11 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి శుక్రవారం కాస్త ఊరట లభించింది. ఈ రోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల, 22 క్యారెట్ల, 18 క్యారెట్ల బంగారంపై రూ.10 చొప్పున తగ్గుదల నమోదైంది. గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఉదయం 6 గంటల సమయానికి హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,100గా నమోదైంది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.1,43,090 వద్ద ట్రేడ్ అవుతుండగా, 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,17,070గా ఉంది.

వివరాలు 

వెండి ధరలు ఇలా..

బంగారం ధరల మాదిరిగానే వెండి ధరల్లో కూడా స్వల్ప తగ్గుదల కనిపించింది. శుక్రవారం 100 గ్రాముల వెండిపై రూ.10, కేజీ వెండిపై రూ.100 మేర తగ్గింది. గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ సమాచారం ప్రకారం, ఉదయం 6 గంటల సమయానికి హైదరాబాద్ మార్కెట్‌లో 100 గ్రాముల వెండి ధర రూ.28,490గా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.2,84,900 వద్ద ట్రేడ్ అవుతోంది.

Advertisement