LOADING...
Gold, Silver Rates : బంగారం, వెండి ధరలు డౌన్.. ఒక్కరోజులోనే భారీగా పతనం
బంగారం, వెండి ధరలు డౌన్.. ఒక్కరోజులోనే భారీగా పతనం

Gold, Silver Rates : బంగారం, వెండి ధరలు డౌన్.. ఒక్కరోజులోనే భారీగా పతనం

వ్రాసిన వారు Jayachandra Akuri
May 15, 2026
11:35 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌లో కొన్ని రోజులుగా దూసుకుపోతున్న బంగారం ధరల ర్యాలీకి తాత్కాలిక బ్రేక్ పడినట్లు కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, అలాగే కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాలను పెంచిన నేపథ్యంలో దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. గుడ్ రిటర్న్స్ ప్రకారం నేడు (మే 15) ఉదయం 10 గంటల సమయానికి హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,60,090కు చేరుకుంది. ఇది నిన్నటి ముగింపు ధరతో పోలిస్తే ఏకంగా రూ.2,240 తగ్గినట్టుగా నమోదైంది. అదే విధంగా 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర కూడా భారీగా పడిపోయింది.

వివరాలు

ఇతర ప్రధాన నగరాల్లో బంగారం ధరలు

ప్రస్తుతం 10 గ్రాముల ధర రూ.1,46,750గా ఉండగా, నిన్నటితో పోలిస్తే రూ.2,050 మేర తగ్గింది. వెండి ధరల్లోనూ భారీ పతనం కనిపించింది. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర ఏకంగా రూ.10 వేల మేర తగ్గి ప్రస్తుతం రూ.3.05 లక్షల వద్ద ట్రేడవుతోంది. దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో కూడా ఇదే ధోరణి కొనసాగుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.1,63,390గా ఉంది. దిల్లీలో రూ.1,60,240గా నమోదైంది. ముంబైలో రూ.1,60,090 వద్ద కొనసాగుతోంది.

వివరాలు

22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి

చెన్నైలో రూ.1,49,500 ఢిల్లీలో రూ.1,46,900 ముంబైలో రూ.1,46,750 వద్ద కొనసాగుతున్నాయి. వెండి ధరల విషయానికి వస్తే, చెన్నై సహా పలు ప్రధాన నగరాల్లో కిలో వెండి ప్రస్తుతం రూ.3.05 లక్షల వద్ద ట్రేడవుతోంది. దేశవ్యాప్తంగా నిన్నటితో పోలిస్తే వెండి ధరలు కిలోకు రూ.10 వేల మేర పడిపోయాయి.

Advertisement