LOADING...
Gold and Silver Prices: మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు.. నేటి తాజా రేట్లు ఇవే!
మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు.. నేటి తాజా రేట్లు ఇవే!

Gold and Silver Prices: మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు.. నేటి తాజా రేట్లు ఇవే!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 11, 2026
10:13 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మరోసారి ఊరట లభించింది. వరుసగా రెండో రోజు కూడా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై ఏకంగా రూ.4,300 తగ్గగా,22 క్యారెట్ల బంగారం ధర రూ.3,950 మేర తగ్గింది. తాజాగా గురువారం కూడా బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది.నేటి ట్రేడింగ్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల,22 క్యారెట్ల,18 క్యారెట్ల బంగారంపై రూ.10 చొప్పున తగ్గింది. గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్‌ వివరాల ప్రకారం ఉదయం 6 గంటల సమయానికి హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,48,850గా ఉంది. 10 గ్రాముల 22క్యారెట్ల బంగారం రూ.1,36,440 వద్ద ఉండగా,18క్యారెట్ల బంగారం ధర రూ.1,11,630గా ట్రేడ్ అవుతోంది.

వివరాలు 

వెండి ధరలు

బంగారం బాటలోనే వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. బుధవారం 100 గ్రాముల వెండిపై రూ.1,000, కిలో వెండిపై రూ.10,000 మేర తగ్గుదల నమోదైంది. తాజాగా గురువారం 100 గ్రాముల వెండిపై రూ.10, కిలో వెండిపై రూ.100 తగ్గింది. గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్‌ సమాచారం ప్రకారం ఉదయం 10 గంటల సమయానికి హైదరాబాద్ మార్కెట్‌లో 100 గ్రాముల వెండి ధర రూ.25,990గా ఉండగా, కిలో వెండి ధర రూ.2,59,900 వద్ద ట్రేడ్ అవుతోంది. గమనిక: బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డిమాండ్, డాలర్ మారకం విలువ తదితర కారణాలతో ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి ఆభరణాలు లేదా పెట్టుబడుల కోసం కొనుగోలు చేసే ముందు తాజా ధరలను ఒకసారి పరిశీలించుకోవడం మంచిది.

Advertisement