LOADING...
Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్‌.. ఒక్కసారిగా తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే? 
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్‌.. ఒక్కసారిగా తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే?

Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్‌.. ఒక్కసారిగా తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే? 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 07, 2025
10:50 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో బంగారం ధరలు ఇవాళ తగ్గుముఖం పట్టాయి. ఉదయం 10 గంటల నాటికి హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో 24 క్యారెట్ల పసిడి (10 గ్రాములు) ధర రూ.550 తగ్గి రూ.1,22,020 వద్దకి చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధరపై కూడా ప్రభావం పడింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.470 తగ్గి రూ.1,11,880 గా నమోదైంది. అదే 18 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.410 తగ్గి రూ.91,520 వద్ద ట్రేడ్ అవుతోంది.

వివరాలు 

ఢిల్లీ,ముంబైలో బంగారం ధరలు 

ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.550 తగ్గి రూ.1,22,170 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.470 తగ్గి రూ.1,12,030, 18 క్యారెట్ల 10 గ్రాములు రూ.410 తగ్గి రూ.91,670 గా ఉన్నాయి. ముంబైలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.550 తగ్గి రూ.1,22,020. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,11,880, 18 క్యారెట్ల ధర రూ.91,520 గా ఉంది.

వివరాలు 

వెండి ధరల్లో స్థిరత్వం 

వెండి రేట్లలో మాత్రం ఎలాంటి మార్పులు కనిపించలేదు. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.1,65,000 గా కొనసాగుతోంది. ఢిల్లీలో కిలో వెండి రూ.1,52,500. ముంబైలోనూ కిలో వెండి రూ.1,52,500 గా స్థిరంగా ఉంది.