LOADING...
Gold Rates: బంగారం ధరలపై బిగ్ రిలీఫ్.. కొనుగోలుదారులకు ఊరట.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే?
ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rates: బంగారం ధరలపై బిగ్ రిలీఫ్.. కొనుగోలుదారులకు ఊరట.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 05, 2026
11:07 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం ధరలు మళ్లీ పడిపోయాయి. కొన్ని గంటల వ్యవధిలోనే రేట్లు తగ్గాయి. గత నాలుగు రోజులుగా క్రమంగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు గురువారం మరోసారి దిగివచ్చాయి. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైన ఈ సమయంలో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది కొంత ఊరట కలిగించే పరిణామంగా చెప్పుకోవచ్చు. తాజా తగ్గుదల తర్వాత వివిధ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. హైదరాబాద్‌లో బంగారం ధరలు హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరరూ.1,63,560గా నమోదైంది. బుధవారం ఈ ధర రూ.1,64,510గా ఉండగా,ఒకరోజులోనే రూ.980తగ్గింది. ఇక 22క్యారెట్ల బంగారం విషయానికి వస్తే, ప్రస్తుతం ధర రూ.1,49,900గా ఉంది. నిన్నఈ ధర రూ.1,50,800గా ఉండగా, ప్రస్తుతం రూ.900 తగ్గుదల నమోదైంది.

వివరాలు 

విజయవాడ, విశాఖపట్నంలో పరిస్థితి

విజయవాడ మరియు విశాఖపట్నం నగరాల్లో కూడా హైదరాబాద్‌లో ఉన్నట్టే బంగారం ధరలు కొనసాగుతున్నాయి. అంటే 24 క్యారెట్ల బంగారం రూ.1,63,560 వద్ద ఉండగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,49,900 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో బంగారం ధరలు చెన్నైలో ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,64,950గా ఉంది. బుధవారం ఈ ధర రూ.1,65,820గా ఉండగా, ప్రస్తుతం రూ.870 తగ్గింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ.1,51,200గా ఉంది. నిన్న ఈ ధర రూ.1,52,200 వద్ద ఉండగా, ఇప్పుడు తగ్గుదల కనిపిస్తోంది.

వివరాలు 

బెంగళూరు, ఢిల్లీ నగరాల్లో ధరలు

బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,63,530గా కొనసాగుతోంది. అక్కడ 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,49,900 వద్ద ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,63,680గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,50,050గా నమోదైంది.

Advertisement

వివరాలు 

వెండి ధరలు

వెండి ధరలు కూడా నగరాల వారీగా వేరువేరుగా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో కేజీ వెండి ధర ప్రస్తుతం రూ.2.85 లక్షల వద్ద ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2.95 లక్షలుగా నమోదైంది. చెన్నైలో కూడా వెండి ధరలు హైదరాబాద్‌కు సమానంగానే కొనసాగుతున్నాయి. మొత్తం మీద చూస్తే, బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో కొనుగోలు చేయాలనుకునే వారికి కొంత ఊరట లభించినట్లే కనిపిస్తోంది.

Advertisement