Loading...
Gold Prices: 14 నెలల కనిష్ఠం నుంచి కోలుకున్న బంగారం,వెండి ధరలు
14 నెలల కనిష్ఠం నుంచి కోలుకున్న బంగారం,వెండి ధరలు

Gold Prices: 14 నెలల కనిష్ఠం నుంచి కోలుకున్న బంగారం,వెండి ధరలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 23, 2026
11:20 am

ఈ వార్తాకథనం ఏంటి

గత కొన్ని రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు సోమవారం స్వల్పంగా పెరిగాయి. శనివారంతో పోలిస్తే పసిడి, వెండి ధరల్లో పెరుగుదల నమోదైంది. 14 నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయిన ధరలు తిరిగి పుంజుకున్నాయి. 10 గ్రాముల బంగారంపై రూ.2,000, కిలో వెండిపై రూ.3,000 పెరుగుదల కనిపించింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1.29 లక్షలకు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1.17 లక్షలుగా నమోదైంది. ఇక కిలో వెండి ధర రూ.1.56 లక్షలకు చేరుకుంది.

vivaralu

ధరలు పెరగడానికి కారణాలివే!

ఇటీవలి రోజుల్లో మార్కెట్‌లో నెలకొన్న భయాందోళనల కారణంగా బంగారం,వెండి ధరలు భారీగా తగ్గి ఓవర్‌సోల్డ్‌ స్థాయికి చేరాయి.

తాజాగా ధరలు తగ్గడంతో కొనుగోళ్ల ఆసక్తి పెరిగింది. మరోవైపు, గతంలో ధరలు తగ్గినప్పుడు విక్రయించిన వారు తిరిగి కొనుగోళ్లు చేపట్టడం (షార్ట్‌ కవరింగ్‌) కూడా ధరల పెరుగుదలకు దోహదపడింది.

పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో ఆభరణాలకు డిమాండ్‌ పెరగడం కూడా పసిడి, వెండి ధరలపై ప్రభావం చూపింది.

వీటికి తోడు అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అంచనాలు కూడా ధరల కదలికలకు కారణమయ్యాయి.

ADVERTISEMENT