Gold, Silver Rates: కొనసాగుతున్న బంగారం ధరల తగ్గుదల.. ప్రస్తుత రేట్లు ఎలా ఉన్నాయంటే..
ఈ వార్తాకథనం ఏంటి
గత వారం పాటు కొత్త రికార్డుల దిశగా దూసుకెళ్లిన బంగారం,వెండి ధరలు ఈ వారం మాత్రం దిగివచ్చాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు (ప్రాఫిట్ బుకింగ్) వెళ్లడం,అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో సోమ,మంగళవారాల్లో ధరల్లో స్పష్టమైన తగ్గుదల కనిపించింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ సమాచారం ప్రకారం,బుధవారం (డిసెంబర్ 31) ఉదయం 6.30 గంటల సమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ.1,36,190గా నమోదైంది. ఇది గత రోజు ఇదే సమయంతో పోలిస్తే సుమారు రూ.3,000 వరకు తక్కువగా ఉంది. అదే విధంగా 22 క్యారెట్ 10 గ్రాముల ఆభరణాల బంగారం ధర కూడా దాదాపు ఇదే స్థాయిలో తగ్గి రూ.1,24,840కు చేరింది. వెండి ధరల్లోనూ గణనీయమైన కోత నమోదైంది.
వివరాలు
కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే వేళ..
మంగళవారం ఒక్కరోజులోనే వెండి ధర సుమారు రూ.18 వేల మేర తగ్గగా, ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,39,900 వద్ద ట్రేడవుతోంది. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే వేళ బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టడం సామాన్యులకు కొంత ఊరటనిస్తోంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగింపు దిశగా కీలక ముందడుగు పడినట్లు ఉక్రెయిన్, అమెరికా అధ్యక్షులు ప్రకటించడంతో పసిడి, వెండిపై డిమాండ్ తగ్గింది. దీనికితోడు ఇన్వెస్టర్లు లాభాలు తీసుకునే దిశగా ముందుకు రావడం కూడా ధరలు అదుపులోకి రావడానికి ప్రధాన కారణంగా మారింది.
వివరాలు
ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం(24కే, 22కే, 18కే) ధరలు
చెన్నై: ₹1,37,450; ₹1,25,990; ₹1,05,040 ముంబై: ₹1,36,190; ₹1,24,840; ₹1,01,920 న్యూఢిల్లీ: ₹1,36,340; ₹1,24,990; ₹1,02,070 కోల్‌కతా: ₹1,36,190; ₹1,24,840; ₹1,01,920 బెంగళూరు: ₹1,36,190; ₹1,24,840; ₹1,01,920 హైదరాబాద్: ₹1,36,190; ₹1,24,840; ₹1,01,920 విజయవాడ: ₹1,36,190; ₹1,24,840; ₹1,01,920 కేరళ: ₹1,36,190; ₹1,24,840; ₹1,01,920 పుణె: ₹1,36,190; ₹1,24,840; ₹1,01,920 వడోదరా: ₹1,36,240; ₹1,24,890; ₹1,01,970 అహ్మదాబాద్: ₹1,36,240; ₹1,24,890; ₹1,01,970
వివరాలు
వెండి (కిలో) ధరలు
చెన్నై: ₹2,57,900 ముంబై: ₹2,39,900 న్యూఢిల్లీ: ₹2,39,900 కోల్‌కతా: ₹2,39,900 బెంగళూరు: ₹2,39,900 హైదరాబాద్: ₹2,57,900 విజయవాడ: ₹2,57,900 కేరళ: ₹2,57,900 పుణె: ₹2,39,900 వడోదరా: ₹2,39,900 అహ్మదాబాద్: ₹2,39,900 గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు మార్కెట్లలో ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కాబట్టి.. కొనుగోలుదారులు మరోసారి ధరలను పరిశీలించగలరు.