Loading...
Gold Price Today: గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం.. నేడు తులం ధర ఎంతంటే..
గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం.. నేడు తులం ధర ఎంతంటే..

Gold Price Today: గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం.. నేడు తులం ధర ఎంతంటే..

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 03, 2025
10:46 am

ఈ వార్తాకథనం ఏంటి

చాలామందికి బంగారం అంటే ప్రత్యేకమైన ఆకర్షణ. ముఖ్యంగా మహిళలు పసిడి ఆభరణాలు ధరించడంలో ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఇదే కారణంగా బంగారం కొనుగోళ్లు ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉంటాయి. అంతర్జాతీయ స్థాయిలో అనిశ్చిత పరిస్థితులు, అమెరికా సుంకాలు,రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, డాలర్ విలువ వంటి ప్రధాన అంశాలు బంగారం, వెండి ధరలను గణనీయంగా పెంచడంలో కీలకంగా ప్రభావం చూపాయి. ఇంకా, బంగారంలో పెట్టుబడులు భారీగా పెరగడం కూడా ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. అందుకే ప్రజలందరూ బంగారం ధరలను తెలుసుకోవడంలో ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు. గత నాలుగు రోజులుగా గణనీయంగా పెరిగిన బంగారం ధర,నేడు(డిసెంబర్ 3)కొంతమేర తగ్గింది. "గుడ్ రిటర్న్స్"వెబ్‌సైట్ ప్రకారం,నేడు ఉదయం 6.30గంటలకు భారతదేశంలో 24క్యారెట్ 10గ్రాముల బంగారం ధర రూ.1,29,860 వద్ద నమోదైంది.

వివరాలు 

ఔన్సు బంగారం ధర 4,207 డాలర్లు 

నిన్నటి ధరతో పోలిస్తే ఇది స్వల్పంగా తగ్గినట్లు ఉంది.

అలాగే, 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ. 1,19,040కి చేరింది. కిలో వెండి ధర రూ. 1,95,900 వద్ద ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు నేడు (బుధవారం) కొంతమేర తగ్గాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 33 డాలర్ల మేర పడిపోయి, ఔన్సు బంగారం ధర 4,207 డాలర్ల వద్దకి దిగింది.

స్పాట్ సిల్వర్ రేటు కూడా ఔన్సుకు 0.54 శాతం తగ్గి 58.25 డాలర్ల వద్ద ఉంది.

ఇక హైదరాబాద్ మార్కెట్‌లో మూడు రోజుల తర్వాత బంగారం ధరలు తగ్గడం గమనార్హం. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,29,860కి దిగింది.

వివరాలు 

బంగారం ధరలు ఇవీ (24కే, 22కే, 18కే) 

22 క్యారెట్ల ఆభరణాల తయారీ బంగారం 10 గ్రాములకు రూ. 550 తగ్గి, తులం ధర రూ. 1,19,040 వద్దకు చేరింది.

అహ్మదాబాద్: ₹1,29,910, ₹1,19,090, ₹97,450

న్యూఢిల్లీ: ₹1,30,010, ₹1,19,190, ₹97,550

ముంబై: ₹1,29,860,₹1,19,040, ₹97,400

బెంగళూరు ₹1,29,860,₹1,19,040,₹97,400

విజయవాడ: ₹1,29,860, ₹1,19,040, ₹97,400

హైదరాబాద్: ₹1,29,860, ₹1,19,040, ₹97,400

చెన్నై: ₹1,31,340; ₹₹1,20,390; ₹1,00,390

కోల్‌కతా: ₹1,29,860; ₹1,19,040; ₹97,400

కేరళ: ₹1,29,860; ₹1,19,040; ₹97,400

పుణె: ₹1,29,860; ₹1,19,040; ₹97,400

ADVERTISEMENT

వివరాలు 

కిలో వెండి ధర 

చెన్నై: ₹1,95,100

ముంబై: ₹1,88,100

న్యూఢిల్లీ: ₹1,88,100

కోల్‌కతా: ₹1,88,100

బెంగళూరు: ₹1,88,100

హైదరాబాద్: ₹1,95,100

విజయవాడ: ₹1,95,100

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. వార్త రాస్తున్న సమయానికి ధరల వివరాలు పైన తెలిపిన విధంగా ఉన్నాయి. కాబట్టి బంగారం కొనుగోలు చేసే ముందు.. ధరలు మళ్లీ ఒకసారి పరిశీలించుకోగలరు.

ADVERTISEMENT