Loading...
Gold Price Today: బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.నేడు తులం రేటు ఎంత పెరిగిందంటే?
బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.నేడు తులం రేటు ఎంత పెరిగిందంటే?

Gold Price Today: బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.నేడు తులం రేటు ఎంత పెరిగిందంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 25, 2026
10:20 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం ధరలు వరుసగా హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి. అయితే ఇటీవలి కాలంలో పసిడి ధరలు ఎక్కువగా పెరుగుతూ కొత్త గరిష్ఠాలను నమోదు చేస్తున్నాయి. వారంలో తొలి రోజైన ఆగస్టు 25న కూడా బంగారం ధరల్లో గణనీయమైన పెరుగుదల నమోదైంది. అంతకుముందు రోజు తులం 24 క్యారెట్ల బంగారం ధర రూ.880 పెరగగా.. తాజాగా కూడా అధిక ధరల వద్దే కొనసాగుతోంది. పసిడి రేట్లు వరుసగా పెరుగుతుండటంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. ఆగస్టు 25న దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

వివరాలు 

24 క్యారెట్ల బంగారం ధర

గుడ్ రిటర్న్స్‌ అందించిన వివరాల ప్రకారం.. ఆగస్టు 25న 1 గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ.89 పెరిగింది. దీంతో గ్రాము పసిడి రేటు రూ.16,397కు చేరింది. తులం (10 గ్రాములు) 24 క్యారెట్ల బంగారం ధర రూ.890 పెరగడంతో.. ప్రస్తుతం రూ.1,63,980 వద్ద కొనసాగుతోంది.

22 క్యారెట్ల పసిడి రేటు కూడా పైకి

24 క్యారెట్లతో పాటు 22 క్యారెట్ల బంగారం ధర కూడా గణనీయంగా పెరిగింది. గ్రాము 22 క్యారెట్ల పసిడి ధర రూ.90 పెరగడంతో రూ.15,040కు చేరింది. ఇక తులం 22 క్యారెట్ల బంగారం ధర రూ.800 పెరిగి రూ.1,50,310 వద్ద ట్రేడవుతోంది.

వివరాలు 

18 క్యారెట్ల బంగారం ధర ఎంతంటే?

24, 22 క్యారెట్ల బంగారం ధరలతో పాటు 18 క్యారెట్ల పసిడి రేటు కూడా పెరిగింది. గ్రాము 18 క్యారెట్ల బంగారం ధర రూ.62 పెరగడంతో రూ.12,294కు చేరింది. తులం 18 క్యారెట్ల బంగారం ధర రూ.610 పెరిగి రూ.1,22,940 వద్ద ఉంది.

వెండి ధర కూడా భారీగానే..

బంగారం ధరలతో పాటు వెండి రేటు కూడా పరుగులు పెడుతోంది. ప్రస్తుతం గ్రాము వెండి ధర రూ.260గా ఉంది. 10 గ్రాముల వెండి కొనుగోలు చేయాలంటే రూ.2,600 చెల్లించాలి. ఇక కిలో వెండి ధర రూ.2,60,000కు చేరింది.

ADVERTISEMENT

వివరాలు 

బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరగడానికి పలు కారణాలు ఉన్నాయి.

అమెరికా డాలర్ విలువ, బాండ్ ఈల్డ్స్‌ (బాండ్లపై వచ్చే రాబడి)కు డిమాండ్ తగ్గడం వంటి పరిణామాలు పసిడి ధరలపై ప్రభావం చూపుతున్నాయి.

గ్లోబల్ మార్కెట్లో ధరలు పెరిగితే దాని ప్రభావం దేశీయ మార్కెట్లపైనా పడుతుంది.

ఫలితంగా భారత్‌లోనూ బంగారం, వెండి రేట్లు పెరుగుతుంటాయి. ఇవే కాకుండా ద్రవ్యోల్బణం, రూపాయి మారకం విలువ, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై ఉన్న అంచనాలు, ప్రపంచవ్యాప్తంగా నెలకొనే భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు వంటి అనేక అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి.

ఈ పరిణామాల ఆధారంగా అంతర్జాతీయ మార్కెట్లో పసిడి రేట్లు మారుతుండగా.. అదే సమయంలో దేశీయ మార్కెట్లోనూ ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి.

ADVERTISEMENT