Praggnanandhaa: ఆధిక్యంలో ప్రజ్ఞానంద.. ఫైనల్‌కు చేరువ!
ఈ వార్తాకథనం ఏంటి
గ్రాండ్ చెస్ టూర్ సెమీఫైనల్లో భారత స్టార్ చెస్ ఆటగాడు ప్రజ్ఞానంద తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. స్థిరమైన ప్రదర్శనతో ఫైనల్ బెర్త్‌కు మరింత చేరువయ్యాడు. సోమవారం జరిగిన క్లాసికల్ రెండో గేమ్‌లో జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్‌పై ప్రజ్ఞానంద విజయం సాధించాడు. సెమీఫైనల్ తొలి గేమ్‌ను డ్రా చేసుకున్న ప్రజ్ఞానంద.. రెండో గేమ్‌లో మాత్రం కీమర్‌ను ఓడించాడు. దీంతో మొత్తం స్కోరులో 9-3తో జర్మన్ ఆటగాడిపై స్పష్టమైన ఆధిక్యంలో నిలిచాడు. మరో సెమీఫైనల్ రెండో క్లాసికల్ గేమ్‌లో అమెరికాకు చెందిన ఫాబియానో కరువానా, అతడి దేశానికే చెందిన వెస్లీ సోతో డ్రా చేసుకున్నాడు.
వివరాలు
ఫైనల్ పై ఆసక్తి
దీంతో కరువానా, వెస్లీ సో ఇద్దరూ చెరో 6 పాయింట్లతో సమంగా ఉన్నారు.
గ్రాండ్ చెస్ టూర్‌లో గెలుపొందిన ఆటగాడికి 6 పాయింట్లు, డ్రా చేసుకున్న వారికి 3 పాయింట్లు లభిస్తాయి.
తదుపరి రౌండ్‌లో ప్రజ్ఞానంద-విన్సెంట్ కీమర్, ఫాబియానో కరువానా-వెస్లీ సో తలపడనున్నారు.
ఇక ఈ రౌండ్‌లో ప్రతి జోడీ తలా రెండు ర్యాపిడ్, నాలుగు బ్లిట్జ్ గేమ్‌లు ఆడనుంది. దీంతో ప్రజ్ఞానంద తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుని ఫైనల్‌కు చేరుతాడా అనే ఆసక్తి నెలకొంది.