Gold and Silver Rates: కొత్త ఏడాదిలోనూ విశ్వరూపమే.. భారీగా పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్స్
ఈ వార్తాకథనం ఏంటి
గతేడాది అంతా అంచనాలు మించిపోయేలా దూసుకెళ్లిన బంగారం,వెండి ధరలు.. కొత్త సంవత్సరంలోనూ అదే ఊపును కొనసాగిస్తున్నాయి. ఏడాది ఆరంభంలోనే బులియన్ మార్కెట్‌లో ధరల పెరుగుదల మగువలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. నేటి ట్రేడింగ్‌లో గోల్డ్, సిల్వర్ ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. తులం బంగారం ధరపై రూ.1,140 పెరుగుదల నమోదుకాగా, కిలో వెండి ధరపై రూ.4,000 పెరిగింది. ఈ ఆకస్మిక పెరుగుదలతో బంగారం అభిమానులు ఆందోళన చెందుతున్నారు. బులియన్ మార్కెట్‌లో నేడు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై రూ.1,140 పెరిగి రూ.1,36,200 వద్ద ట్రేడ్ అవుతోంది.
వివరాలు
షాక్ ఇచ్చిన వెండి ధరలు
అదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,050 పెరిగి రూ.1,24,850కు చేరింది. ఇక 18 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై రూ.860 పెరుగుదలతో రూ.1,02,150 వద్ద కొనసాగుతోంది. వెండి ధరలు కూడా నేటి రోజు షాక్ ఇచ్చాయి. కిలో వెండి ధరపై రూ.4,000 పెరుగుదల కనిపించింది. ఫలితంగా బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,42,000 వద్ద అమ్ముడవుతోంది. అయితే హైదరాబాద్, చెన్నై మార్కెట్లలో మాత్రం కిలో వెండి ధర రూ.2,60,000 స్థాయిలో ట్రేడ్ అవుతోంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్‌కతా మార్కెట్లలో కిలో వెండి ధర రూ.2,42,000 వద్ద కొనసాగుతోంది.