Gold Rates: పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు
ఈ వార్తాకథనం ఏంటి
బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగి ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. శుభకార్యాల కోసం బంగారం కొనాల్సిన అవసరం తప్పనిసరిగా ఉండటంతో సామాన్యులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ స్థాయిలో ధరలు పెరగడంతో కొనుగోలు చేయాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయంగా ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు కనిపించకపోయినా, ఇలా ఒక్కసారిగా ధరలు పెరగడం ఎందుకన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈరోజు తులం బంగారం ధర రూ.2,400 పెరగగా, కిలో వెండి ధర రూ.4,000 మేర పెరిగింది. బులియన్ మార్కెట్‌లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,400 పెరిగి సుమారు రూ.1,38,550 వద్ద ట్రేడింగ్ అవుతోంది.
వివరాలు
రూ.4,000 పెరిగిన వెండి ధర
అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,200 పెరిగి దాదాపు రూ.1,27,000కు చేరింది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,800 పెరిగి సుమారు రూ.1,03,910 వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి ధరలు కూడా భారీ షాక్ ఇచ్చాయి. ఈరోజు కిలో వెండి ధరపై రూ.4,000 పెరుగుదల నమోదైంది. దీంతో వెండి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. బులియన్ మార్కెట్‌లో ఈరోజు కిలో వెండి ధర సుమారు రూ.2,23,000 వద్ద అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నై బులియన్ మార్కెట్లలో మాత్రం కిలో వెండి ధర రూ.2,34,000 దగ్గర ఉంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్‌కతా మార్కెట్లలో కిలో వెండి ధర సుమారు రూ.2,23,000 వద్ద ట్రేడింగ్ అవుతోంది.