Gold Rates: న్యూఇయర్ వేళ శాంతించిన వెండి ధర,స్వల్పంగా పెరిగిన పసిడి ధర
ఈ వార్తాకథనం ఏంటి
గత సంవత్సరం బంగారం,వెండి ధరలు సరికొత్త రికార్డులు సృష్టించాయి. ఎన్నడూ లేనంతగా ధరలు ఆకాశన్నంటాయి బంగారం మెరుపులు మెరిపిస్తే,వెండి ధరలు కూడా ఒక వెలుగు వెలిగాయి.ఈ స్థాయి ధరల ప్రభావంతో సాధారణ ప్రజలు పసిడి కొనాలంటేనే బెంబేలెత్తిపోయారు. కొత్త సంవత్సరం వేళ బంగారం ధర స్వల్పంగా పెరిగింది. అయితే వెండి ధర మాత్రం ఉపశమనం కలిగించింది. బులియన్ మార్కెట్‌లో ఈ రోజు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.170 పెరుగుతూ రూ.1,35,060 వద్ద ట్రేడ్ అవుతోంది. అదే సమయంలో, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 పెరుగుతూ రూ.1,23,800 వద్ద అమ్ముడవుతోంది.
వివరాలు
హైదరాబాద్, చెన్నైలో కిలో వెండి ధరలు
18 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర కూడా రూ.120 పెరుగుతూ రూ.1,01,290 వద్ద ట్రేడింగ్ చేస్తున్నారు. మొత్తంగా కొత్త సంవత్సరంలో వెండి ధరలలో ఉపశమనం లభించింది. కిలో వెండి ధర ఈ రోజు రూ.1,000 తగ్గి రూ.2,38,000 వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే, హైదరాబాద్, చెన్నైలో కిలో వెండి ధరలు రూ.2,56,000 వద్ద ఉంటున్నాయి. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా మార్కెట్లలో కిలో వెండి ధర రూ.2,38,000 వద్దే ట్రేడింగ్ అవుతోంది.