Loading...
Gold Prices Today: బంగారం కొనేవారికి గుడ్‌న్యూస్.. ఒక్కరోజే భారీగా పడిపోయిన పసిడి రేట్లు..
బంగారం కొనేవారికి గుడ్‌న్యూస్.. ఒక్కరోజే భారీగా పడిపోయిన పసిడి రేట్లు..

Gold Prices Today: బంగారం కొనేవారికి గుడ్‌న్యూస్.. ఒక్కరోజే భారీగా పడిపోయిన పసిడి రేట్లు..

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 30, 2026
10:31 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం ధరలు మరోసారి భారీగా తగ్గాయి. దీపావళి పండుగకు ముందు పసిడి రేట్లు వరుసగా దిగివస్తుండటంతో కొనుగోలుదారులకు ఊరట లభిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడటం,అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించడం వంటి పరిణామాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం(అక్టోబర్ 30) మార్కెట్లు ప్రారంభమైన వెంటనే పసిడి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. మరి దేశవ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్‌లో తాజా బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. భారత బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ.1,42,260గా ఉంది. గురువారంతో పోలిస్తే శుక్రవారం ఒక్కరోజే రూ.1,690 తగ్గింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,400కు చేరింది.

వివరాలు 

విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలోనూ ఇదే ధరలు

దీనిపై కూడా రూ.1,550 తగ్గుదల నమోదైంది. హైదరాబాద్ మార్కెట్లోనూ పసిడి ధరలు ఇదే స్థాయిలో పడిపోయాయి.

హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,260 వద్ద కొనసాగుతోంది.

తాజాగా రూ.1,690 తగ్గింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,30,400కు చేరగా.. రూ.1,550 మేర దిగివచ్చింది.

విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,410గా ఉంది. 22 క్యారెట్ల పసిడి రేటు రూ.1,30,550 వద్ద ట్రేడవుతోంది.

మరోవైపు చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,260 కాగా.. 22 క్యారెట్ల ధర రూ.1,30,400గా నమోదైంది. బెంగళూరులోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

వివరాలు 

వెండి ధరల్లోనూ భారీ మార్పులు

బంగారం ధరలు తగ్గుతుంటే.. వెండి ధరలు కూడా భారీగా తగ్గినట్లు మార్కెట్ సమాచారం వెల్లడిస్తోంది.

హైదరాబాద్‌లో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2.10 లక్షలుగా ఉంది. గురువారం కిలో వెండి ధర రూ.2.15 లక్షలుగా ఉండగా.. తాజా ధరల ప్రకారం రూ.5 వేలు తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలోనూ కిలో వెండి ధర రూ.2.10 లక్షలుగా కొనసాగుతోంది.

ADVERTISEMENT