Gold and Silver Rates : స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే..
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవలి కాలంలో పెరుగుతున్న బంగారం ధరలు ఈ మధ్యకాలంలో స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రపంచ రాజకీయాల, భౌగోళిక పరిస్థితులలో అనిశ్చితి కొనసాగుతుండటంతో, పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈ కారణంగా బంగారం పై డిమాండ్ పెరుగుతోంది. అలాగే, డాలర్ తో పోల్చితే భారత రూపాయి విలువ తగ్గడం కూడా బంగారం ధరల పెరుగుదలకు కారణంగా మారింది. ఈ పరిస్థితుల్లో, డిసెంబర్ 12న 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,30,760 రూపాయలకు చేరింది. అదే సమయంలో, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,19,860 వద్ద నిలిచింది.
వివరాలు
వెండి ధర 100 రూపాయల తగ్గుదల
ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,30,910 వద్ద ఉంది, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,20,010కి చేరింది. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,760గా కొనసాగుతోంది, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,19,860కి చేరింది. వెండి ధర నిన్నటి కంటే కిలోకు సుమారుగా 100 రూపాయల తగ్గుదలతో ఉంది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇప్పుడు తెలుసుకుందాం..
వివరాలు
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)
హైదరాబాద్‌లో రూ.1, 30, 760, రూ. 1, 19, 860 విజయవాడలో రూ.1, 30, 760, రూ. 1, 19, 860 ఢిల్లీలో రూ. 1,30, 910, రూ. 1, 20, 010 ముంబైలో రూ. 1,30, 760, రూ. 1, 19, 860 వడోదరలో రూ. 1,30, 810, రూ. 1, 19, 910 కోల్‌కతాలో రూ. 1,30, 760, రూ. 1, 19, 860 చెన్నైలో రూ. 1,30, 760, రూ. 1, 19, 860 బెంగళూరులో రూ. 1,30, 760, రూ. 1, 19, 860 కేరళలో రూ. 1,30, 760, రూ. 1, 19, 860 పుణెలో రూ. 1,30, 760, రూ. 1, 19, 860
వివరాలు
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)
హైదరాబాద్‌లో రూ. 2, 09, 100 విజయవాడలో రూ. 2, 09, 100 ఢిల్లీలో రూ. 2, 01, 100 చెన్నైలో రూ. 2, 09, 100 కోల్‌కతాలో రూ. 2, 01, 100 కేరళలో రూ. 2, 09, 100 ముంబైలో రూ. 2, 01, 100 బెంగళూరులో రూ. 2, 01, 100 వడోదరలో రూ. 2, 01, 100 అహ్మదాబాద్‌లో రూ. 2, 01, 100 గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.