
Gold Price: భారీగా తగ్గుముఖంపట్టిన బంగారం ధర.. రూ.2వేల పైన తగ్గిన పసిడి
ఈ వార్తాకథనం ఏంటి
బంగారం ధరల్లో ఒక్కరోజులోనే గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి.
అక్షయ తృతీయ సందర్భంగా స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు,నేడు భారీగా పడిపోయాయి.
తులం బంగారం ధర ఏకంగా రూ.2,000 మేర తగ్గడం గమనార్హం.
పసిడి రేట్లు తగ్గిపోతుండటంతో కొనుగోలుదారుల్లో ఊరట కనిపిస్తోంది.
హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర (గ్రాము) రూ.9,573గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర (గ్రాము) రూ.8,775 వద్ద ట్రేడవుతోంది.
వివరాలు
కొద్దిగా తగ్గిన వెండి ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.2,000తగ్గడంతో, ప్రస్తుతంరూ.87,750 వద్ద లభిస్తోంది.
అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,180 తగ్గి, రూ.95,730 వద్ద ట్రేడ్ అవుతోంది.
విజయవాడ,విశాఖపట్నం వంటి నగరాల్లో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,900 కాగా, 24క్యారెట్ల ధర రూ.2,160 తగ్గి రూ.95,880 వద్ద ట్రేడ్ అవుతోంది.
బంగారంతో పాటు వెండి ధరల్లోనూ స్వల్పంగా తగ్గుదల కనిపిస్తోంది.నేడు వెండి ధరలు కొద్దిగా తగ్గాయి.
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.100 తగ్గడంతో,ధర ప్రస్తుతం రూ.1,08,900 వద్ద ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.99,900 వద్ద అమ్ముడవుతోంది.