LOADING...
Gold and Silver Rates : స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. ఈ రోజు బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. ఈ రోజు బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Rates : స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. ఈ రోజు బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 12, 2025
10:15 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవలి కాలంలో స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు గత మూడు రోజులుగా మళ్లీ పెరుగుదల దిశగా సాగుతున్నాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల కారణంగా పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండటంతో, బంగారానికి డిమాండ్ నిరంతరంగా కొనసాగుతోంది. అదనంగా, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తగ్గిపోవడం కూడా బంగారం ధరల పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ పరిస్థితుల్లో, ఈ రోజు (నవంబర్ 12న) 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ₹1,25,850కి చేరింది. అదే 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ₹1,15,360గా నమోదైంది.

వివరాలు 

వంద రూపాయల మేర పెరిగిన వెండి రేటు

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు ₹1,25,980గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర ₹1,15,510కి చేరుకుంది. హైదరాబాద్‌, విజయవాడ వంటి నగరాల్లో కూడా 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ₹1,25,850గా, 22 క్యారెట్ల ధర ₹1,15,360గా నమోదైంది. ఇక వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే వంద రూపాయల మేరకు వెండి రేటు పెరిగింది. మొత్తం మీద దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం,వెండి ధరలు పెరుగుదల ధోరణిని కొనసాగిస్తున్నాయి.

వివరాలు 

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్) 

హైదరాబాద్‌లో రూ.1, 25, 850, రూ.1, 15, 360 విజయవాడలో రూ. 1,25, 850, రూ. 1,15, 360 ఢిల్లీలో రూ. 1, 25,980, రూ. 1,15, 510 ముంబైలో రూ. 1, 25, 850, రూ. 1, 15, 360 వడోదరలో రూ. 1,25, 900, రూ. 1,15, 410 కోల్‌కతాలో రూ. 1, 25, 850, రూ. 1, 15, 360 చెన్నైలో రూ. 1,25, 850, రూ. 1,15, 360 బెంగళూరులో రూ. 1, 25, 850, రూ. 1, 15, 360 కేరళలో రూ. 1, 25, 850, రూ. 1, 15, 360 పుణెలో రూ. 1, 25, 850, రూ. 1, 15, 360

వివరాలు 

ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి) 

హైదరాబాద్‌లో రూ. 1, 70, 100 విజయవాడలో రూ. 1, 70, 100 ఢిల్లీలో రూ. 1, 60, 100 చెన్నైలో రూ. 1, 70, 100 కోల్‌కతాలో రూ. 1, 60, 100 కేరళలో రూ. 1, 70, 100 ముంబైలో రూ. 1, 60, 100 బెంగళూరులో రూ. 1, 60, 100 వడోదరలో రూ. 1, 60, 100 అహ్మదాబాద్‌లో రూ. 1, 60, 100 గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.