LOADING...
Gold and Silver: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఈ రోజు బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఈ రోజు బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఈ రోజు బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 25, 2025
10:38 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం ధర రోజూ పెరుగుతూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. భౌగోళిక రాజకీయ పరిస్థితుల అస్థిరత కారణంగా పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తులైన బంగారం వైపు ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నారు. అంతేకాక, రూపాయి డాలర్‌ ముందుగా బలహీనపడటంతో కూడా బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా మారింది. ఈ పరిస్థితుల్లో, సెప్టెంబర్ 25న 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,15,360కి చేరింది. అదే విధంగా 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,05,740కి పెరిగింది.

వివరాలు 

100 రూపాయల మేర తగ్గిన వెండి 

రాష్ట్ర రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 1,15,510గా నమోదయింది,కాగా 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,05,890కి చేరింది. హైదరాబాద్, విజయవాడలో కూడా బంగారం ధరలు గరిష్ఠ స్థాయిని తాకాయి. ఇక్కడ 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,15,360గా ఉండగా, 22 క్యారెట్లది రూ. 1,05,740కి చేరింది. వెండి ధరలు నిన్నకు పోలిస్తే కేజీకి సుమారు 100 రూపాయల మేర తగ్గిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిస్థితిలో, దేశంలోని ప్రధాన నగరాల్లోని తాజా బంగారం, వెండి రేట్ల వివరాలను కింద తెలుసుకోవచ్చు.

వివరాలు 

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్) 

హైదరాబాద్‌లో రూ.1,15, 360,రూ. 1,05, 740 విజయవాడలో రూ.1,15, 360,రూ. 1,05, 740 ఢిల్లీలో రూ. 1,15, 510,రూ. 1,05, 890 ముంబైలో రూ. 1, 15, 360, రూ. 1, 05, 740 వడోదరలో రూ. 1, 15, 410, రూ. 1, 05, 790 కోల్‌కతాలో రూ. 1, 15, 360, రూ. 1, 05, 740 చెన్నైలో రూ. 1, 15, 360, రూ. 1, 05, 740 బెంగళూరులో రూ. 1, 15, 360, రూ. 1, 05, 740 కేరళలో రూ. 1, 15, 360, రూ. 1, 05, 740 పుణెలో రూ. 1, 15, 360, రూ. 1, 05, 740

వివరాలు 

ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి) 

హైదరాబాద్‌లో రూ. 1, 49, 900 విజయవాడలో రూ. 1, 49, 900 ఢిల్లీలో రూ. 1, 39, 900 చెన్నైలో రూ. 1, 49, 900 కోల్‌కతాలో రూ. 1, 39, 900 కేరళలో రూ. 1, 49, 900 ముంబైలో రూ. 1, 39, 900 బెంగళూరులో రూ. 1, 39, 900 వడోదరలో రూ. 1, 39, 900 అహ్మదాబాద్‌లో రూ. 1, 39, 900 గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.