Gold Rates: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. హడలెత్తిస్తున్న సిల్వర్
ఈ వార్తాకథనం ఏంటి
మహిళలకు గుడ్‌న్యూస్.బంగారం ధరల్లో తగ్గుదల కనిపించింది. బుధవారం గణనీయంగా పెరిగిన రేట్లు,గురువారం మాత్రం కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. రోజు రోజుకూ పసిడి రేట్లు మారుతుండడంతో కొనుగోలుదారులు కొంత నిరాశ చెందుతున్నారు. ఈరోజు తులం బంగారం ధరలో రూ.110 తగ్గుదల నమోదయ్యింది. అయితే వెండి ధర కిలోకు రూ.2,000 వరకు పెరిగింది. దీంతో సిల్వర్ ధర రికార్డ్ స్థాయిలో దూసుకుపోతుంది.
వివరాలు
బులియన్ మార్కెట్ సమాచారం ప్రకారం..
● 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ.110 తగ్గి ప్రస్తుతం రూ.1,30,200 వద్ద ఉంది. ● 22 క్యారెట్ 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ.1,19,350 వద్ద విక్రయమవుతోంది. ● 18 క్యారెట్ బంగారం రేటు రూ.80 తగ్గి 10 గ్రాములకు రూ.97,650గా ట్రేడ్ అవుతోంది. వెండి విషయానికొస్తే ధరలు భారీగా పెరిగాయి. కిలో వెండిపై ఒక్కరోజులోనే రూ.2,000 పెరుగుదల నమోదైంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇప్పుడు కిలో వెండి ధర రూ.2,09,000కి చేరింది. అయితే ఢిల్లీ, ముంబై, కోల్‌కతా మార్కెట్లలో కిలో వెండి రేటు రూ.2,01,000 చుట్టూ కొనసాగుతోంది.