LOADING...
Gold and Silver Rates: పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. భారీగా తగ్గిన బంగారం ధరలు,తులం ఎంతంటే?
పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. భారీగా తగ్గిన బంగారం ధరలు,తులం ఎంతంటే?

Gold and Silver Rates: పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. భారీగా తగ్గిన బంగారం ధరలు,తులం ఎంతంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 23, 2026
12:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో బంగారం,వెండి ధరల్లో వరుసగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా గురువారం ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల మధ్య కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1200పైగా తగ్గింది. అదే సమయంలో వెండి ధర కూడా ఐదు వేల రూపాయల వరకు తగ్గింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ధరల పరిస్థితిని పరిశీలిస్తే ఆసక్తికర మార్పులు కనిపిస్తున్నాయి. భారీ మార్పుల అనంతరం ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది గ్రాముల బంగారం ధర రూ.1,53,550 వద్ద కొనసాగుతోంది.

వివరాలు 

విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో బంగారం ధర 

ఉదయం ఆరు గంటలకు ఇదే ధర 1,54,740గా ఉంది. అంటే కేవలం నాలుగు గంటల్లోనే తులం బంగారం ధర రూ.1200పైగా దిగొచ్చింది. ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర కూడా ఉదయంతో పోలిస్తే రూ.1100 తగ్గింది. ప్రస్తుతం రూ.1,40,750 వద్ద కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,53,550గా ఉండగా, ఉదయం అది రూ. 1,54,740గా ఉంది. ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర రూ.1,40,750 వద్ద కొనసాగుతుంది. దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, పూణే, బెంగళూరు నగరాల్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ధరలే కనిపిస్తున్నాయి.

వివరాలు 

ధరలు ఎక్కువగా ఉండటానికి ముఖ్య కారణం

దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.1,53,700 వద్ద కొనసాగుతోంది. ఉదయం ఇది 1,54,890 గా ఉంది. చెన్నైలో తులం బంగారం ధర రూ.1,54,480 వద్ద కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాలతో పోల్చితే ఇతర ప్రాంతాల్లో ధరలు ఎక్కువగా ఉండటానికి ముఖ్య కారణం రవాణా వ్యయం. బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసిన తర్వాత ఓడరేవుల నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలించేందుకు ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యంగా ఢిల్లీ వంటి సముద్ర తీరానికి దూరంగా ఉన్న ప్రాంతాలకు రవాణా, భద్రతా బీమా ఖర్చులు అధికమవుతాయి. అందువల్ల అక్కడ ధరలు ఎక్కువగా ఉంటాయి.

Advertisement

వివరాలు 

వెండి ధరలు

వెండి ధరలు కూడా బంగారం మాదిరిగానే మార్పులకు లోనవుతున్నాయి. గత రెండు రోజులుతో పోలిస్తే వెండి ధరలు కొంత తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఒక కిలో వెండి ధర రూ.2,70,000 ఉంది. ఉదయంతో పోల్చుకుంటే ఇది రూ .5000 వరకు తగ్గింది. దేశీయ స్థాయిలో మాత్రం వెండి ధర రూ.2,60,000 వద్ద కొనసాగుతుంది. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో బంగారం, వెండి ధరలు తరచుగా మారుతుంటాయి. కాబట్టి ఖచ్చితమైన ధరల కోసం సమీపంలోని బంగారం దుకాణం లేదా సంబంధిత వెబ్‌సైట్లను పరిశీలించడం మంచిది.

Advertisement