Loading...
Gold Rates: పసిడి ధరలకు మళ్లీ రెక్కలు.. నగరాల వారీగా రేట్లు ఇవే..
పసిడి ధరలకు మళ్లీ రెక్కలు.. నగరాల వారీగా రేట్లు ఇవే..

Gold Rates: పసిడి ధరలకు మళ్లీ రెక్కలు.. నగరాల వారీగా రేట్లు ఇవే..

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 10, 2026
11:36 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఇది కీలక సమాచారం. ఇటీవల తగ్గుతూ వచ్చిన పసిడి ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. గురువారం బంగారం రేట్లు మళ్లీ పెరిగాయి. అంతేకాదు, కొన్ని గంటల వ్యవధిలోనే ధరల్లో మార్పులు కనిపించాయి. సెప్టెంబర్ 10న దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. దేశీయ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,55,510గా ఉంది. అదే సమయంలో 22క్యారెట్ల పసిడి రేటు రూ.1,42,550గా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,510కి చేరింది. నేటి ట్రేడింగ్‌లో ఇది ఏకంగా రూ.1,200 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,550గా ఉండగా.. ఒక్కరోజులో రూ.1,100 పెరుగుదల నమోదైంది.

వివరాలు 

నగరాల వారీగా రేట్లు ఇవే..

విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి.

చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,510గా ఉంది. 22 క్యారెట్ల పసిడి రేటు రూ.1,42,550 వద్ద కొనసాగుతోంది.

బెంగళూరులోనూ 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,510గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,42,550గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం బంగారం ధరలు స్వల్పంగా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రూ.1,55,660గా పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,700గా ఉంది.

వెండి ధరల్లోనూ భారీ పెరుగుదల నమోదైంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2.55 లక్షలకు చేరింది.

బుధవారం కిలో వెండి రూ.2.50 లక్షల వద్ద ఉండగా.. గురువారం రూ.5,000 పెరిగింది.

వివరాలు 

పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం

హైదరాబాద్‌లోనూ కిలో వెండి ధర రూ.2.55 లక్షలుగా కొనసాగుతోంది. చెన్నైలో కూడా ఇదే రేటు ఉంది.

బెంగళూరులో గురువారం కిలో వెండి ధర రూ.2.55 లక్షలకు చేరింది. అంతకుముందు రోజు రూ.2.50 లక్షల వద్ద ఉన్న వెండి రేటు ఒక్కరోజులో రూ.5,000 పెరిగింది.

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటం కూడా అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం చూపుతోంది.

ADVERTISEMENT

వివరాలు 

పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం

దీనికి తోడు ముడి చమురు ధరలు మరోసారి రికార్డు స్థాయిల వైపు కదులుతున్నాయి.

క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును దాటింది. చమురు ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణంపై ఆందోళనలు పెరుగుతున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

దీంతో పసిడి ధరలకు మళ్లీ డిమాండ్ పెరిగి రేట్లు పైకి కదులుతున్నాయి. అయితే ఈ పెరుగుదల ఎంతకాలం కొనసాగుతుందనేది రానున్న రోజుల్లో తేలనుంది.

ADVERTISEMENT