Gold Price Today : మరో షాకిచ్చిన బంగారం,వెండి ధరలు.. ఏకంగా రూ.9వేలు పెరిగింది.. అందుకు కారణాలు ఏంటంటే..
ఈ వార్తాకథనం ఏంటి
బంగారం,వెండి కొనుగోలు చేయాలని చూస్తున్నవారికి షాకింగ్ అప్‌డేట్. ఒక్క రాత్రిలోనే ఈ రెండు లోహాల ధరల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఫలితంగా, కిలో వెండి రేటు మరోసారి రూ.2 లక్షల మార్క్ వైపు దూసుకుపోగా, బంగారం ధర రూ.లక్షన్నర దిశగా పయనిస్తోంది. గురువారం ఉదయం వెలువడిన తాజా వివరాల ప్రకారం .. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.2,290 పెరిగింది.22 క్యారట్ల బంగారంపై రూ.2,100 పెరుగుదల నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా గోల్డ్ ధరలు భారీగా ఎగసిపోయాయి. ఔన్సు బంగారం ధర 100 డాలర్లు పెరిగి ప్రస్తుతం 4,207 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
వివరాలు
ధరల పెరుగుదల వెనుక కారణాలు
వెండి ధరలు కూడా అదే దిశలో దూసుకెళ్తున్నాయి. కిలో వెండిపై రూ.9,000 పెరుగుదల నమోదు కాగా, సోమవారం నుంచి ఇప్పటివరకు కేవలం నాలుగు రోజుల్లోనే వెండి ధర రూ.17,000 మేర పెరిగింది. బంగారం,వెండి ధరలు ఈ స్థాయిలో పెరగడానికి అనేక ఆర్థిక మరియు రాజకీయ అంశాలు కారణమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా.. అమెరికా డాలర్ విలువ తగ్గడం, ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరగడం,సెంట్రల్ బ్యాంకుల పెట్టుబడుల విభజన (Diversification), గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడుల ప్రవాహం పెరగడం, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇవి ధరల పెరుగుదలకూ ప్రధాన కారణాలుగా చెప్పబడ్డాయి.
వివరాలు
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర - ₹1,17,150. 24 క్యారట్ల ధర - ₹1,27,800 దేశంలోని ఇతర నగరాల్లో బంగారం ధరలు ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,17,300 కాగా, 24 క్యారట్ల ధర ₹1,27,950 ఉంది. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 22 క్యారట్ల బంగారం ధర ₹1,17,150 కాగా, 24 క్యారట్ల ధర ₹1,27,950గా నమోదైంది.
వివరాలు
వెండి ధరలు ఇలా ఉన్నాయి
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర ₹1,82,000కు చేరింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరులో కిలో వెండి ధర ₹1,72,000 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి ధర ₹1,82,000గా ఉంది. గమనిక: పైన సూచించిన రేట్లు గురువారం ఉదయం మార్కెట్ ప్రారంభ సమయానికి ఉన్నవే. బంగారం, వెండి ధరలు మార్కెట్ పరిస్థితులనుబట్టి రోజులోనే మారవచ్చు.