Loading...
Gold Prices: గోల్డ్ కొనుగోలుదారులకు షాక్.. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
గోల్డ్ కొనుగోలుదారులకు షాక్.. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

Gold Prices: గోల్డ్ కొనుగోలుదారులకు షాక్.. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 06, 2026
10:38 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మరోసారి ధరల పెరుగుదల షాక్ ఇచ్చింది. ఇటీవల కొన్ని రోజుల పాటు తగ్గుముఖం పట్టి కొనుగోలుదారులకు ఊరటనిచ్చిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. వెండి ధరలు కూడా అదే దారిలో సాగుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, ముఖ్యంగా ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు,ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల ప్రభావంతో బంగారం,వెండి ధరలు పెరుగుతున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. తాజాగా గురువారం (ఆగస్టు 6) ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం దేశీయ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.10 పెరిగి రూ.1,45,760కు చేరుకుంది.

వివరాలు 

కిలో వెండి ధర రూ.2,40,100

అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర కూడా రూ.10 పెరిగి రూ.1,33,610గా నమోదైంది. వెండి ధర కూడా పెరిగింది. కిలో వెండి ధర రూ.100 పెరిగి రూ.2,40,100కు చేరుకుంది.

అయితే బంగారం, వెండి ధరలు అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా పరిస్థితులు, రాష్ట్రాల వారీగా ఉండే పన్నులు తదితర అంశాల ప్రభావంతో ధరల్లో స్వల్ప మార్పులు కనిపిస్తుంటాయి.

వివరాలు 

ప్రధాన నగరాల్లో నేటి బంగారం,వెండి ధరలు

హైదరాబాద్: 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,45,760గా ఉంది.22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,33,610గా నమోదైంది.కిలో వెండి ధర రూ.2,40,100గా ఉంది.

విజయవాడ, విశాఖపట్నం: 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,45,760.22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,33,610గా ఉంది.వెండి కిలో ధర రూ.2,40,100గా కొనసాగుతోంది.

ఢిల్లీ: 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,45,910గా ఉంది.22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,33,760గా నమోదైంది.వెండి కిలో ధర రూ.2,40,100గా ఉంది.

ముంబై: 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,45,760. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,33,610గా ఉంది.వెండి కిలో ధర రూ.2,40,100గా కొనసాగుతోంది.

ADVERTISEMENT

వివరాలు 

గమనిక 

చెన్నై: 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,45,760. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,33,610గా నమోదైంది. వెండి కిలో ధర రూ.2,40,100గా ఉంది.

బెంగళూరు: 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,45,760. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,33,610గా ఉంది. వెండి కిలో ధర రూ.2,40,100గా నమోదైంది.

బంగారం,వెండి ధరలు ప్రతిరోజూ అంతర్జాతీయ మార్కెట్ ధోరణులు, డాలర్ మారకం విలువ, స్థానిక డిమాండ్,సరఫరా,రాష్ట్ర పన్నులు వంటి అంశాల ఆధారంగా మారుతూ ఉంటాయి.

అందువల్ల నగరాల వారీగా ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు కనిపిస్తాయి.

తాజా బంగారం, వెండి ధరలను తెలుసుకోవాలనుకునే వారు 8955664433 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి తాజా రేట్లను తెలుసుకోవచ్చు.

ADVERTISEMENT