Loading...
Gold Rate Today: దీపావళికి ముందు భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులంపై ఎంత తగ్గిందంటే?
దీపావళికి ముందు భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులంపై ఎంత తగ్గిందంటే?

Gold Rate Today: దీపావళికి ముందు భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులంపై ఎంత తగ్గిందంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 31, 2026
09:21 am

ఈ వార్తాకథనం ఏంటి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీపావళి పండుగ సమీపిస్తున్న వేళ పసిడి ధరలు తగ్గుముఖం పడుతుండటం కొనుగోలుదారులకు ఊరటనిస్తోంది. ఇటీవల భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు వరుసగా తగ్గుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, మార్కెట్ పరిస్థితుల ప్రభావంతో పసిడి, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. సాధారణంగా బంగారం, వెండి ధరలు ఒక్కోసారి పెరుగుతూ.. మరికొన్ని సందర్భాల్లో తగ్గుతూ ఉంటాయి. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ యుద్ధం, రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు, సౌదీ-హౌతీల మధ్య ఘర్షణలు వంటి అంతర్జాతీయ పరిణామాలు బులియన్ మార్కెట్‌పై ప్రభావం చూపుతుంటాయి. ఈ క్రమంలోనే శుక్రవారం బంగారం ధరలు భారీగా తగ్గాయి.

వివరాలు

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు

తులంపై దాదాపు రూ.1,800 వరకు పతనమైనట్లు సమాచారం. పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. శనివారం (అక్టోబర్ 31) ఉదయం 6 గంటల సమయానికి దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం: 10 గ్రాముల ధరపై రూ.10 తగ్గి రూ.1,42,250కు చేరింది.

22 క్యారెట్ల బంగారం: 10 గ్రాముల ధర రూ.10 తగ్గి రూ.1,30,390గా నమోదైంది.

వెండి: కిలో ధరపై రూ.100 తగ్గి రూ.2,09,900కు చేరింది.

వివరాలు

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు

హైదరాబాద్‌: 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,42,250గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,30,390గా ఉంది. వెండి కిలో ధర రూ.2,09,900గా కొనసాగుతోంది.

విజయవాడ: 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,42,250 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,30,390గా ఉంది. వెండి కిలో ధర రూ.2,09,900గా నమోదైంది.

ఢిల్లీ: 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,42,400గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,30,540గా ఉంది. వెండి కిలో ధర రూ.2,09,900గా కొనసాగుతోంది.

ముంబై: 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,42,250 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,30,390గా ఉంది. వెండి కిలో ధర రూ.2,09,900గా ఉంది.

ADVERTISEMENT

వివరాలు

అన్ని నగరాల్లో ఒకే ధర ఉండదు!

బంగారం, వెండి ధరలు దేశంలోని అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు. స్థానికంగా ఉండే డిమాండ్‌, సరఫరా, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులు తదితర అంశాలను బట్టి ధరల్లో మార్పులు చోటుచేసుకుంటాయి.

అందుకే హైదరాబాద్‌, విజయవాడ, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో పసిడి ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు కనిపిస్తుంటాయి.

మరోవైపు, బంగారం, వెండి ధరలకు సంబంధించిన తాజా వివరాలు తెలుసుకోవాలనుకునే వారు 8955664433 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

తద్వారా తాజా ధరల అప్‌డేట్స్‌ తెలుసుకోవచ్చని సంబంధిత సమాచారం పేర్కొంటోంది.

ADVERTISEMENT