Gold Prices: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం,వెండి ధరలు.. తులం ఎంతంటే?
ఈ వార్తాకథనం ఏంటి
మంగళవారం దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లలో అమెరికా డాలర్ బలపడటం, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందన్న అంచనాలు పసిడి ధరలపై ప్రభావం చూపించాయి. దీంతో బంగారానికి డిమాండ్ కొంత తగ్గి ధరలు దిగివచ్చాయి. 'గుడ్ రిటర్న్స్' సమాచారం ప్రకారం.. మంగళవారం ఉదయం 6:30 గంటలకు ప్రధాన నగరాల్లో నమోదైన ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,140గా ఉంది. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.1,41,290 వద్ద కొనసాగుతోంది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,15,560గా నమోదైంది.
వివరాలు
ఏపీలోనూ దాదాపు ఇవే ధరలు
ఇక వెండి విషయానికొస్తే.. కిలో ధర రూ.2,54,900 వద్ద స్థిరంగా ఉంది.
తెలంగాణలోని వరంగల్, నిజామాబాద్, ఖమ్మం తదితర ప్రధాన నగరాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం, అమరావతి, కాకినాడ, తిరుపతి నగరాల్లోనూ హైదరాబాద్ మార్కెట్‌కు సమానంగా బంగారం ధరలు ఉన్నాయి.
ఇతర ప్రధాన నగరాలను పరిశీలిస్తే.. చెన్నై, ముంబయి, బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రూ.1,54,140గా ఉంది. ఢిల్లీలో మాత్రం కొద్దిగా ఎక్కువగా రూ.1,54,290 వద్ద ట్రేడవుతోంది.