LOADING...
Gold and Silver Rates: గ్లోబల్ మార్కెట్ ప్రభావంతో తగ్గిన బంగారం ధరలు..
గ్లోబల్ మార్కెట్ ప్రభావంతో తగ్గిన బంగారం ధరలు..

Gold and Silver Rates: గ్లోబల్ మార్కెట్ ప్రభావంతో తగ్గిన బంగారం ధరలు..

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 29, 2026
09:29 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ మార్కెట్‌లో డిమాండ్ తగ్గడం, షేర్ మార్కెట్లు కోలుకోవడం, అమెరికా కరెన్సీ బలపడటం వంటి అంశాల ప్రభావంతో బంగారం ధరలు క్రమంగా పడిపోతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో భౌగోళిక, రాజకీయ పరిణామాలు కూడా ధరల్లో మార్పులకు కారణమవుతున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ వివరాల ప్రకారం, బుధవారం ఉదయం 6 గంటల సమయానికి హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,920గా నమోదైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆభరణాల బంగారం ధర రూ.1,38,340గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,070గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,38,490గా ఉంది.

vivaralu

వెండి ధర

ఇక వెండి ధరల విషయంలో కూడా తగ్గుదల కనిపిస్తోంది. కిలో వెండి ధర రూ.100 మేర పడిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ.2,64,900గా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,59,900గా నమోదైంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.2,64,900గా ఉండగా, బెంగళూరులో రూ.2,59,900గా ఉంది. గమనిక: బంగారం, వెండి ధరలు రోజూ మారుతూ ఉంటాయి. కాబట్టి కొనుగోలు చేయడానికి ముందు తాజా ధరలను తప్పనిసరిగా పరిశీలించాలి.

Advertisement