LOADING...
Today Gold and Silver Prices: భారీగా పడిపోయిన బంగారం ధరలు.. తులం ధర ఎంతంటే?
భారీగా పడిపోయిన బంగారం ధరలు.. తులం ధర ఎంతంటే?

Today Gold and Silver Prices: భారీగా పడిపోయిన బంగారం ధరలు.. తులం ధర ఎంతంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 06, 2026
11:31 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో దేశీయ బులియన్ మార్కెట్‌లో విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టాయి. అమెరికా ఉద్యోగ గణాంకాలు అంచనాల కంటే మెరుగ్గా నమోదవడం, డాలర్ బలపడటం వంటి పరిణామాలు బంగారం, వెండి ధరలపై ఒత్తిడి తెచ్చాయి. దీంతో ఇటీవల గరిష్ట స్థాయిల్లో కొనసాగిన ధరలు ప్రస్తుతం తగ్గాయి. నేటి ట్రేడింగ్‌లో తులం బంగారం ధర రూ.3,000 వరకు తగ్గగా, కిలో వెండి ధర రూ.10,000 మేర క్షీణించింది.

వివరాలు

24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.15,273

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.15,273గా నమోదైంది. 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.14,000గా ఉండగా, 18 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.11,455 వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,000 తగ్గి రూ.1,52,730కు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,750 తగ్గడంతో రూ.1,40,000 వద్ద ట్రేడవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,910గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,40,150 వద్ద విక్రయమవుతోంది.

వివరాలు

కిలో వెండి ధర రూ.2,65,000

వెండి ధరల విషయానికి వస్తే, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.10,000 తగ్గి రూ.2,70,000కు చేరుకుంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,65,000 వద్ద ట్రేడవుతోంది. అమెరికా ఆర్థిక గణాంకాలు, డాలర్ బలపడం వంటి అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఒత్తిడిలో కొనసాగుతున్నాయని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement