Gold prices: రూ.1.25 లక్షల వద్ద బంగారం ధరలు.. 2027లో మరింత పెరుగుతాయా?
ఈ వార్తాకథనం ఏంటి
జనవరి 2026లో గరిష్ఠంగా రూ.1.80 లక్షలకు చేరిన 10 గ్రాముల బంగారం ధరలు.. ఆ తర్వాత భారీగా తగ్గాయి. దాదాపు 32 శాతం క్షీణించి రూ.1.22 లక్షల స్థాయికి పడిపోయాయి. అయితే గత రెండు రోజులుగా పసిడి ధరల్లో మళ్లీ స్వల్పంగా పెరుగుదల కనిపిస్తోంది. నవంబర్ 27న ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం ధర 2.08 శాతం పెరిగి రూ.1,24,816కు చేరింది. 24 క్యారెట్ల రిటైల్ బంగారం ధర రూ.1,25,440గా నమోదైంది. నవంబర్ 26న డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 1 శాతం లాభంతో రూ.1,22,349 వద్ద ముగిశాయి.
వివరాలు
2027 చివరి నాటికి బంగారం ధరలు ఎలా ఉండొచ్చు?
ఇటీవల ధరలు తగ్గినప్పటికీ మధ్యకాలంలో బంగారంపై సానుకూల అంచనాలే ఉన్నాయని జేపీ మోర్గాన్ ప్రైవేట్ బ్యాంక్‌కు చెందిన యుక్సువాన్ టాంగ్ అభిప్రాయపడ్డారు.
అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగే అవకాశాలు ఉండటంతో స్వల్పకాలంలో బంగారంపై ఒత్తిడి కొనసాగవచ్చని తెలిపారు.
అయితే కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, కరెన్సీల విలువ తగ్గకుండా రక్షణగా బంగారాన్ని కొనుగోలు చేసే వారి సంఖ్య పెరగడం ధరలకు మద్దతుగా నిలుస్తాయన్నారు.
2027 చివరి నాటికి అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 4,600 డాలర్లకు చేరవచ్చని అంచనా వేశారు.
ప్రస్తుత 3,648 డాలర్ల స్థాయి నుంచి చూస్తే ఇది దాదాపు 26 శాతం పెరుగుదల.
వివరాలు
బంగారం ధరలకు మద్దతుగా నిలుస్తున్న అంశాలు
మోతీలాల్ ఓస్వాల్ ప్రైవేట్ వెల్త్ నివేదిక ప్రకారం.. అమెరికాలో ద్రవ్యోల్బణం అంచనాలకు మించి నమోదవడం, చమురు ధరలు పెరగడం వంటివి వడ్డీ రేట్ల పెంపు అంచనాలను బలపరిచాయి.
దీంతో డాలర్ విలువ, బాండ్ రాబడులు పెరిగి బంగారంపై ఒత్తిడి ఏర్పడింది.
అయినప్పటికీ కేంద్ర బ్యాంకులు సెప్టెంబర్‌లో 61 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి.
అక్టోబర్‌లో గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి 19 టన్నుల పెట్టుబడులు వచ్చాయి.
భారత్‌లో పెళ్లిళ్లు, పండుగల సీజన్ కారణంగా మూడో త్రైమాసికంలో బంగారు ఆభరణాల డిమాండ్ 33 శాతం పెరిగి 100 టన్నులకు చేరింది.
సెప్టెంబర్‌లో భారత గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు 71 శాతం పెరిగి రూ.4,451 కోట్లుగా నమోదయ్యాయి.
వివరాలు
మదుపరులు ఏం చేయాలి?
గ్లోబల్ వడ్డీ రేట్లు, అమెరికా డాలర్ కదలికలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయని జియోటస్ సీఈఓ విక్రమ్ సుబ్బురాజ్ తెలిపారు.
ధరలు పెరుగుతున్నాయని తొందరపడి కొనుగోళ్లు చేయొద్దని సూచించారు.
ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకుండా విడతలవారీగా కొనుగోలు చేయడం,పెట్టుబడికి పరిమితులు నిర్ణయించుకోవడం,దీర్ఘకాలిక దృష్టితో వ్యవహరించడం మంచిదన్నారు.
దేశీయంగా ధరలు కోలుకుంటున్నప్పటికీ ఇది స్థిరమైన పెరుగుదలకు సంకేతమని ఇప్పుడే చెప్పలేమని పేర్కొన్నారు.