LOADING...
Gold & Silver Rates: అంతర్జాతీయ ఉద్రిక్తతల మధ్య స్థిరంగా బంగారం.. వెండి ధరలో స్వల్ప తగ్గుదల
అంతర్జాతీయ ఉద్రిక్తతల మధ్య స్థిరంగా బంగారం.. వెండి ధరలో స్వల్ప తగ్గుదల

Gold & Silver Rates: అంతర్జాతీయ ఉద్రిక్తతల మధ్య స్థిరంగా బంగారం.. వెండి ధరలో స్వల్ప తగ్గుదల

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 27, 2026
08:56 am

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ స్థాయిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నా కూడా బంగారం డిమాండ్ తగ్గడం లేదు. భౌగోళిక,రాజకీయ పరిణామాల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా వాటా మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. అయినప్పటికీ పెట్టుబడిదారులు బంగారాన్ని ఇప్పటికీ భద్రమైన పెట్టుబడిగా భావిస్తూ కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. ఈ కారణంగా బంగారం ధరలు పెద్దగా మార్పులు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు (ఏప్రిల్ 27న) ఉదయం 6.30 గంటల సమయానికి హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,54,030గా నమోదైంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ఆభరణాల బంగారం ధర రూ.1,41,190గా ఉంది.

వివరాలు 

వెండి ధర

దేశ రాజధాని ఢిల్లీలో 24క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,54,180గా ఉండగా, 22క్యారెట్ల 10గ్రాముల ఆభరణాల బంగారం ధర రూ.1,41,340గా నమోదైంది. చెన్నై నగరంలో 24క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,54,900గా ఉండగా, 22క్యారెట్ల బంగారం ధర రూ.1,41,990గా ఉంది. ఇక వెండి ధరల విషయానికి వస్తే స్వల్ప తగ్గుదల కనిపించింది.కిలోకు సుమారు వంద రూపాయల మేర తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్,విజయవాడ నగరాల్లో కిలో వెండి ధర రూ.2,69,900గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,59,900గా ఉండగా,చెన్నైలో రూ.2,69,900గా,బెంగళూరులో రూ.2,59,900గా కొనసాగుతోంది. గమనిక: బంగారం,వెండి ధరలు తరచుగా మారుతూ ఉంటాయి.అందువల్ల కొనుగోలు చేయడానికి ముందు తాజా ధరలను ఒకసారి పరిశీలించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement