Gold & Silver Rates: దేశంలో మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో తాజా ధరలు ఇలా..
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌లో బంగారం ధరలు వరుసగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల ప్రభావంతో పసిడి ధరలు మరోసారి పెరిగాయి. బంగారం, వెండిపై దిగుమతి సుంకాలు పెరగడంతో ఇప్పటికే ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం కూడా దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరుగుదల దిశగా కొనసాగాయి. గుడ్ రిటర్న్స్ వివరాల ప్రకారం.. నేడు ఉదయం 10.30 గంటల సమయానికి హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.330 పెరిగి రూ.1,62,330కు చేరుకుంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.300 పెరిగి రూ.1,48,800గా నమోదైంది. నగరంలో కిలో వెండి ధర కూడా స్వల్పంగా పెరిగి రూ.3,20,100కు చేరింది.
వివరాలు
వెండి ధరల్లో తగ్గుదల
ఇక దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లోనూ బంగారం ధరలు పెరిగాయి. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,64,180గా ఉండగా, 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,50,500కు చేరుకుంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,62,330గా నమోదవగా, 22 క్యారెట్ల ధర రూ.1,48,800గా ఉంది. జాతీయ రాజధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,260గా కొనసాగుతోంది. అక్కడ 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,48,950 వద్ద నిలిచింది. మరోవైపు దేశవ్యాప్తంగా వెండి ధరల్లో మాత్రం తగ్గుదల కనిపించింది. చెన్నైలో కిలో వెండి ధర అత్యధికంగా రూ.3.15 లక్షలుగా ఉండగా, ఇతర నగరాల్లో కిలో వెండి ధర సుమారు రూ.3 లక్షల వద్ద కొనసాగుతోంది.