Gold Rates: బంగారం ధరలకు రెక్కలు.. ఒక్కరోజే భారీగా పెరిగిన పసిడి రేట్లు!
ఈ వార్తాకథనం ఏంటి
బంగారం ధరలు మరోసారి భగ్గుమంటున్నాయి. ఈ వారంలో పసిడి ధరలు క్రమంగా పుంజుకుంటున్నాయి. భారత్‌పై 100 శాతం దిగుమతి సుంకాలు విధించే బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన నేపథ్యంలో మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. దీంతో పెట్టుబడిదారులు బంగారంపై దృష్టి సారించడంతో ఈ విలువైన లోహానికి డిమాండ్ పెరిగింది. ఫలితంగా బంగారం ధరలు ఎగబాకుతున్నాయి. మరోవైపు ముడి చమురు ధరలు తగ్గడం, డాలర్ బలపడటం వంటి పరిణామాలు కూడా పసిడి ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 19న దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
వివరాలు
24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,840
ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,840 వద్ద కొనసాగుతోంది. ఇవాళ ఒక్కరోజే 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,420 పెరిగింది.
ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,850 వద్ద ట్రేడవుతోంది. 22 క్యారెట్ల రేటు కూడా నేడు రూ.1,300 మేర పెరిగింది.
విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే బంగారం ధరలు కొనసాగుతున్నాయి.
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,840 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,42,850గా ఉంది.
బెంగళూరులోనూ 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,55,840గా ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,850 వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,990గా ఉంది.
వివరాలు
భారీగా పెరిగిన వెండి ధరలు
22 క్యారెట్ల రేటు రూ.1,43,000 వద్ద కొనసాగుతోంది. బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో వెండి ధర ఒక్కసారిగా రూ.5 వేలు పెరిగింది.
ఢిల్లీలో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2.55 లక్షలుగా ఉంది. శుక్రవారం ఇదే ధర రూ.2.50 లక్షల వద్ద స్థిరపడింది. చెన్నైలో కేజీ సిల్వర్ ధర రూ.2.60 లక్షల వద్ద కొనసాగుతోంది.
నిన్న కిలో వెండి ధర రూ.2.55 లక్షల వద్ద ఉంది. హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ రూ.2.60 లక్షల వద్ద ట్రేడవుతోంది.