LOADING...
Gold Prices: భారీగా పెరిగిన బంగారం ధరలు.. ₹1.5 లక్ష మార్క్ దాటిన పసిడి
భారీగా పెరిగిన బంగారం ధరలు.. ₹1.5 లక్ష మార్క్ దాటిన పసిడి

Gold Prices: భారీగా పెరిగిన బంగారం ధరలు.. ₹1.5 లక్ష మార్క్ దాటిన పసిడి

వ్రాసిన వారు Sirish Praharaju
May 07, 2026
09:18 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల ₹1.5 లక్షల దిగువకు వచ్చిన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర తాజాగా మళ్లీ పెరిగి ఆ మార్క్‌ను దాటింది. దీంతో బంగారం కొనాలనుకునే వారికి ఇది షాక్‌గా మారింది. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా నెలకొన్న అనిశ్చితి వల్ల బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది. తాజా వివరాల ప్రకారం,గురువారం ఉదయం 6:00 గంటల సమయంలో హైదరాబాద్,విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,52,140గా ఉంది. అదే సమయంలో 22క్యారెట్ల 10 గ్రాముల ఆభరణాల బంగారం ధర ₹1,39,460గా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,52,290గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆభరణాల బంగారం ధర ₹1,39,610గా ఉంది.

వివరాలు 

వెండి ధరలు 

ఇక వెండి ధరలు కూడా పెరిగాయి. కిలోకు ₹100 మేర పెరుగుదల నమోదైంది. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర ₹2,75,100గా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర ₹2,65,100గా నమోదైంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర ₹2,75,100గా ఉండగా, బెంగళూరులో ₹2,65,100గా ఉంది. గమనిక: బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మారుతూ ఉంటాయి. అందువల్ల కొనుగోలు చేసే ముందు తాజా ధరలను తప్పనిసరిగా తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement