Gold and Silver Price: తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు తాజా ధరలు ఇవే..
ఈ వార్తాకథనం ఏంటి
ఈ మధ్యకాలంలో బంగారం ధరల్లో తరచూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అందువల్ల ప్రజలు రోజువారీగా బంగారం ధరలపై కన్నేసి ఉంచుతున్నారు. ధరలు తగ్గుతున్నాయా లేక పెరుగుతున్నాయా అనే విషయంపై ఆసక్తి పెరుగుతోంది. ప్రస్తుతం పెళ్లిళ్ల కాలం నడుస్తుండటంతో, ధరలు కొద్దిగా తగ్గినా వెంటనే కొనుగోలు చేయాలనే ఉత్సాహం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. బంగారం అంటే అందరికీ ఇష్టమే,ముఖ్యంగా మహిళలకు దీనిపై ప్రత్యేకమైన మక్కువ ఉంటుంది. చాలా మంది మహిళలు వీలైనంత ఎక్కువగా బంగారం కొనాలని భావిస్తారు. ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనడానికే ముందుంటారు. అయితే గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా తగ్గాయి.
వివరాలు
నిన్నటి ధరలతో పోలిస్తే నేడు స్వల్ప తగ్గుదల
అంతర్జాతీయ మార్కెట్ ధోరణుల ప్రకారం ఈరోజు ధరల వివరాలు ఇలా ఉన్నాయి. ఏప్రిల్ 30, 2026 గురువారం నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,50,430గా నమోదైంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,37,890గా ఉంది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,12,820గా కొనసాగుతోంది. ఇక నిన్నటి ధరలతో పోలిస్తే స్వల్ప తగ్గుదల కనిపించింది. ఏప్రిల్ 29, బుధవారం నాడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,50,440గా ఉండగా, ఈరోజు రూ. 10 తగ్గి రూ. 1,50,430కి చేరింది.
వివరాలు
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర..
అలాగే 22 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ. 1,37,900గా ఉండగా, ఈరోజు రూ. 10 తగ్గి రూ. 1,37,890గా మారింది. 18 క్యారెట్ల బంగారం ధర కూడా నిన్న రూ. 1,12,830గా ఉండగా, ఈరోజు రూ. 10 తగ్గి రూ. 1,12,820గా నమోదైంది. ప్రధాన నగరాల్లో కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,50,430గా ఉంది. 22 క్యారెట్ల ధర రూ. 1,37,890 కాగా, 18 క్యారెట్ల ధర రూ. 1,12,820గా కొనసాగుతోంది. ఇదే విధంగా విజయవాడలో కూడా ధరలు మార్పు లేకుండా హైదరాబాద్‌కు సమానంగా ఉన్నాయి.