Loading...
Gold, Silver Prices: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. తాజా రేట్లు ఇవే..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. తాజా రేట్లు ఇవే..

Gold, Silver Prices: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. తాజా రేట్లు ఇవే..

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 03, 2026
11:29 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇటీవల ధరల తగ్గుదల కొంత ఊరటనిస్తోంది. గత కొన్ని రోజులుగా గోల్డ్ రేట్లు క్రమంగా దిగివస్తుండగా,ఈరోజు (బుధవారం) కూడా స్వల్పంగా తగ్గాయి. నిన్న(మంగళవారం)హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,56,220గా ఉండగా,22 క్యారెట్ల బంగారం రూ.1,43,200, 18 క్యారెట్ల బంగారం రూ.1,17,170 వద్ద ట్రేడ్ అయింది. తాజాగా మూడు రకాల బంగారం ధరలపై 10 గ్రాములకు రూ.10 చొప్పున తగ్గుదల నమోదైంది. గుడ్‌రిటర్న్స్ వివరాల ప్రకారం బుధవారం ఉదయం 6 గంటల సమయానికి హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,56,210గా ఉంది. అదే సమయంలో 22క్యారెట్ల బంగారం రూ.1,43,190, 18 క్యారెట్ల బంగారం రూ.1,17,160 వద్ద ట్రేడవుతోంది.

వివరాలు 

ప్రముఖ నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర ఇలా ( 10 గ్రాములు)

హైదరాబాద్: రూ.1,56,210

అమరావతి: రూ.1,56,210

విజయవాడ: రూ.1,56,210

విశాఖపట్నం: రూ.1,56,210

రాజమండ్రి: రూ.1,56,210

అనంతపురం: రూ.1,56,210

వరంగల్: రూ.1,56,210

ఖమ్మం: రూ.1,56,210

కడప: రూ.1,56,210

వివరాలు 

తగ్గుముఖం పట్టిన వెండి ధరలు 

బంగారం ధరల బాటలోనే వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి.

మంగళవారం హైదరాబాద్ మార్కెట్‌లో 100 గ్రాముల వెండి ధర రూ.29,000గా ఉండగా, కిలో వెండి రూ.2,90,000 వద్ద ట్రేడ్ అయింది.

బుధవారం 100 గ్రాముల వెండిపై రూ.10, కిలో వెండిపై రూ.100 మేర తగ్గుదల నమోదైంది.

దీంతో గుడ్‌రిటర్న్స్ సమాచారం ప్రకారం ఉదయం 6 గంటల ప్రాంతంలో 100 గ్రాముల వెండి ధర రూ.28,990గా ఉండగా, కిలో వెండి రూ.2,89,900 వద్ద ట్రేడవుతోంది.

గమనిక: బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డిమాండ్, కరెన్సీ మార్పిడి విలువల ప్రభావంతో ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు తాజా ధరలను మరోసారి పరిశీలించడం మంచిది.

ADVERTISEMENT