Gold Prices: తగ్గుముఖం పట్టిన బంగారం,వెండి ధరలు.. మరింత దిగొచ్చే అవకాశం!
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రభావంతో దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఇటీవల వరుసగా పెరిగిన ధరలు సామాన్య ప్రజలను ఆందోళనకు గురిచేశాయి. రోజురోజుకూ ధరలు మారిపోతుండటంతో భవిష్యత్తులో బంగారం,వెండి కొనుగోలు చేయడం సాధ్యమేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒక రోజు ఉన్న ధర మరుసటి రోజుకు మారిపోతుండటంతో కొనుగోలుదారులు ఎదురుచూపుల ధోరణి అవలంబిస్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరలు మరింత తగ్గే అవకాశముందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, పెట్టుబడిదారుల వైఖరిలో మార్పులు ఇందుకు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు.
వివరాలు
హైదరాబాద్ మార్కెట్‌లో..
గుడ్ రిటర్న్స్ వివరాల ప్రకారం మంగళవారం (మే 19) ఉదయం హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,210గా నమోదైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,190గా ఉంది. కిలో వెండి ధర రూ.3,00,100కు చేరింది. సోమవారంతో పోలిస్తే బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా, వెండి ధరలు కొద్దిగా పెరిగాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,360గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,340గా నమోదైంది. కిలో వెండి ధర రూ.2,90,100గా కొనసాగుతోంది.
వివరాలు
వెండి ధర
ముంబై మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,210గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,190గా ఉంది. అక్కడ కిలో వెండి ధర రూ.2,90,100గా నమోదైంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.1,60,900గా కొనసాగుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,490గా ఉంది.