Gold Rates on Dec 29: బంగారం,వెండి ధరలు.. ఈ వారం సరికొత్త రికార్డులకు ఛాన్స్!
ఈ వార్తాకథనం ఏంటి
గత వారం బంగారం,వెండి ధరల్లో ర్యాలీ కొనసాగింది. కొన్ని సరికొత్త ఆల్ టైమ్ రికార్డులు కూడా నమోదయ్యాయి. ఈ వారం కూడా ధరలు ఇలానే పెరుగుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రత్యేకంగా, పసిడి ధర రూ.1.50 లక్షల స్థాయిని దాటే అవకాశం ఉందని వారు సూచిస్తున్నారు. మంగళవారం జరగనున్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ సమావేశం ఫలితాల ప్రకారం బంగారం, వెండి ధరల తీరు కొంతమేర మారవచ్చు. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, సోమవారం (డిసెంబర్ 29) ఉదయం 6.30 గంటలకు: 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,210 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,440 కిలో వెండి ధర రూ.2,50,900 వద్ద స్థిరపడింది.
వివరాలు
ఈ వారం కూడా ధరల పెరుగుదల కొనసాగే అవకాశాలు
అంతర్జాతీయ మార్కెట్‌లో గత వారం బంగారం ధర 3.77 శాతం పెరిగింది. 24 క్యారెట్ బంగారం ధర ఔన్స్ 4,584 డాలర్లు స్థాయిలో ఆల్ టైమ్ హైను చేరింది. ఈ వారం కూడా ధరల పెరుగుదల కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక వెండి ధరలు కూడా గణనీయంగా పెరిగి, 14.4 శాతం వృద్ధితో 79.70 వద్ద ఆల్ టైమ్ హైను తాకాయి. ప్రపంచ వ్యాప్తంగా భౌగోళిక రాజకీయాలు అనిశ్చితంగా ఉండటం,డాలర్ ప్రభావం తగ్గిపోవటం, బలహీనపడటం వలన ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడులైన బంగారం, వెండి వైపు ఆకర్షితులవుతున్నారు. అదనంగా, వెండి పై పారిశ్రామిక డిమాండ్ కూడా ఉండటం వలన, బంగారాన్ని మించిన లాభాలు వెండి ఇన్వెస్టర్లకు లభిస్తున్నాయి.
వివరాలు
వివిధ నగరాల్లో 10 గ్రాముల బంగారం (24కే, 22కే, 18కే) ధరలు
చెన్నై: ₹1,41,810; ₹1,29,990; ₹1,08,490 ముంబై: ₹1,41,210; ₹1,29,440; ₹1,05,910 న్యూఢిల్లీ: ₹1,41,360; ₹1,29,590; ₹1,06,060 కోల్‌కతా: ₹1,41,210; ₹1,29,440; ₹1,05,910 బెంగళూరు: ₹1,41,210; ₹1,29,440; ₹1,05,910 హైదరాబాద్: ₹1,41,210; ₹1,29,440; ₹1,05,910 విజయవాడ: ₹1,41,210; ₹1,29,440; ₹1,05,910 కేరళ: ₹1,41,210; ₹1,29,440; ₹1,05,910 పుణె: ₹1,41,210; ₹1,29,440; ₹1,05,910 వడోదరా: ₹1,41,260; ₹1,29,490; ₹1,05,960 అహ్మదాబాద్: ₹1,41,260; ₹1,29,490; ₹1,05,960
వివరాలు
వెండి(కిలో) ధరలు ఇవీ
చెన్నై: ₹2,73,900 ముంబై: ₹2,50,900 న్యూఢిల్లీ: ₹2,50,900 కోల్‌కతా: ₹2,50,900 బెంగళూరు: ₹2,50,900 హైదరాబాద్: ₹2,73,900 విజయవాడ: ₹2,73,900 కేరళ: ₹2,73,900 పుణె: ₹2,50,900 వడోదరా: ₹2,50,900 అహ్మదాబాద్: ₹2,50,900 గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు మార్కెట్లలో ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కాబట్టి, బంగారం కొనుగోలు చేసే సమయంలో ధరలను మరోసారి పరిశీలించగలరు.