LOADING...
Goldman Sachs: చమురు ధరలు మరింత పెరిగే అవకాశం: గోల్డ్‌మ్యాన్ సాచ్స్
చమురు ధరలు మరింత పెరిగే అవకాశం: గోల్డ్‌మ్యాన్ సాచ్స్

Goldman Sachs: చమురు ధరలు మరింత పెరిగే అవకాశం: గోల్డ్‌మ్యాన్ సాచ్స్

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 27, 2026
09:52 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ పెట్టుబడి బ్యాంకింగ్ సంస్థ గోల్డ్‌మ్యాన్ సాచ్స్(Goldman Sachs) చమురు ధరలు ఈ ఏడాది నాలుగో త్రైమాసికానికి మరింత పెరిగే అవకాశముందని అంచనా వేసింది. అంతర్జాతీయ స్థాయిలో బ్రెంట్‌ ముడి చమురు ధర బ్యారెల్‌కు 90 డాలర్ల వరకు, అలాగే అమెరికాకు చెందిన వెస్ట్‌ టెక్సస్‌ ముడి చమురు ధర 83 డాలర్ల వద్ద ఉండొచ్చని తెలిపింది. పశ్చిమ ఆసియా ప్రాంతంలో చమురు ఉత్పత్తి తగ్గే సూచనలు ఉన్నాయని పేర్కొంది. అదేవిధంగా శుద్ధి చేసిన చమురు ఉత్పత్తుల ధరలు అధికంగా ఉండటం కూడా ధరల పెరుగుదలకు కారణమని వివరించింది. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంక్షోభ పరిస్థితులు మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశముందని వెల్లడించింది.

వివరాలు 

లాభాల్లో దేశీయ మార్కెట్‌ సూచీలు

ఇదిలా ఉంటే ముడి చమురు ధరలు మళ్లీ పెరిగాయి.నేటి ట్రేడింగ్‌'లో బ్రెంట్‌ చమురు ధర సుమారు రెండు శాతం పెరిగి 107.49 డాలర్లకు చేరింది. ఏప్రిల్‌ తర్వాత ఇదే అత్యధిక స్థాయిగా నమోదైంది.మరోవైపు అమెరికాకు చెందిన వెస్ట్‌ టెక్సస్‌ ముడి చమురు ధర 1.77 డాలర్లు పెరిగి 96.17 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇక దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల 19 నిమిషాల సమయానికి BSE Sensex 392 పాయింట్లు పెరిగి 77,056 వద్ద ట్రేడవుతుండగా, Nifty 50 126 పాయింట్లు లాభపడి 24,024 వద్ద కొనసాగుతోంది. మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 11 పైసలు పడిపోయి 94.27 వద్ద ట్రేడవుతోంది.

Advertisement